తెలంగాణ కొత్త సీఎస్ ఖరార్- ఏపీకి సోమేష్ కుమార్ రిలీవ్: ఒక్కరోజే గడువు: డీఓపీటీ
హైదరాబాద్: తెలంగాణకు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాబోతోన్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారి కే రామకృష్ణా రావు నియామకం దాదాపు ఖరారైనట్టే. ప్రస్తుతం ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తోన్నారు. తరువాతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడొచ్చని చెబుతున్నారు. అరవింద్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది.

సోమేష్ కుమార్ రిలీవింగ్..
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రిలీవ్ అయ్యారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్.. కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. ఆయనను తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి రిలీవ్ చేసింది. ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీనికి ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చింది. గురువారం నాటికి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది డీఓపీటీ.

విభజన సమయంలో..
1989 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్. ఆయన స్వరాష్ట్రం బిహార్. ఏపీ విభజన సమయంలో సోమేష్ కుమార్ తెలంగాణ క్యాడర్ కు వెళ్లారు. సీనియారిటీకి అనుగుణంగా 2019 డిసెంబర్ 31వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.

తెలంగాణలో కొనసాగడానికి..
తెలంగాణలో కొనసాగడం వైపు మొగ్గు చూపిస్తూ కొంతమంది అఖిల భారత సర్వీస్ అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. వారిలో సోమేష్ కుమార్ కూడా ఉన్నారు. క్యాట్ ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని కేంద్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

క్యాట్ ఉత్తర్వులు కొట్టివేత..
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సారథ్యంలోని బెంచ్- ఇవ్వాళ తీర్పు వెలువడించింది. సోమేష్ కుమార్ ను తెలంగాణలో కొనసాగింపజేస్తూ గతంలో క్యాట్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కొనసాగింపు చెల్లదని స్పష్టం చేసింది. ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సి ఉంటుందనీ పేర్కొంది.

డీఓపీటీ ఉత్తర్వులు..
తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువడించిన కొన్ని గంటల్లోనే డీఓపీటీ స్పందించింది. సోమేష్ కుమార్ కు రిలీవింగ్ ఆర్డర్లు కూడా జారీ చేసింది. గురువారం నాటికి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సోమేష్ కుమార్ తక్షణమే తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ పొందినట్లు కూడా స్పష్టం చేసింది డీఓపీటీ.

సుప్రీంలో అప్పీల్..?
కాగా తనను రిలీవ్ చేస్తూ డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలు, ఏపీ క్యాడర్ కు బదలాయిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమేష్ కుమార్ అప్పీల్ కు వెళ్లొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో పిటీష్ దాఖలు చేస్తారని చెబుతున్నారు. అదే సమయంలో- వలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారనే వాదనలు సైతం వినిపిస్తోన్నాయి. వీఆర్ఎస్ కే మొగ్గు చూపొచ్చనీ అంటున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications