• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Samantha Naga Chaitanaya Divorce: సమంత-చైతన్య విడాకులపై ఫస్ట్ రియాక్షన్... వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగచైతన్యల వివాహ బంధానికి తెరపడటం బిగ్ హాట్ టాపిక్‌గా మారింది.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ మీడియాలోనూ ఇప్పుడీ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ జంట బ్రేకప్‌పై ఇప్పటివరకూ ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించలేదు. తొలిసారిగా దర్శకుడు రాంగోపాల్ వర్మ పరోక్షంగా స్పందించారు. గతంలో 'విడాకులు' అనే అంశంపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.'పెళ్లిళ్లు కాదు... విడాకులను సెలబ్రేట్ చేసుకోవాలి... పెళ్లి అనేది చావు,విడాకులు పునర్జన్మ...' అని వర్మ తన పోస్టులో వ్యాఖ్యానించారు.

విడాకులపై రాంగోపాల్ వర్మ...

విడాకులపై రాంగోపాల్ వర్మ...


వర్మ తన పోస్టులో ఎక్కడా సమంత,నాగచైతన్యల పేర్లు ప్రస్తావించనప్పటికీ... టైమ్లీగా,పరోక్షంగా ఆ జంటను ఉద్దేశించే పోస్టు పెట్టారనే విషయం స్పష్టమవుతోంది.ఇక ఆ ఇంటర్వ్యూలో వర్మ విడాకులపై మాట్లాడుతూ... నీ ఇష్టం లేకుండా,నీ ప్రమేయం లేకుండా నిన్ను నిర్బంధించడమనేది జైలు అయితే... పెళ్లి అనేది అంతకన్నా పెద్ద జైలు అని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.జైలు నుంచి విడుదలైతే ఎంత ఎక్కువ ఆనందిస్తారో... పెళ్లి అనే బంధం నుంచి బయటపడేటప్పుడు అంతకన్నా ఎక్కువ ఆనందిస్తారని వర్మ పేర్కొన్నారు.మెజారిటీ వ్యక్తులకు పెళ్లి అనేది వర్కౌట్ కాదన్నారు.

విడాకులు ఆ అంశాలతో ముడిపడి...: వర్మ

విడాకులు ఆ అంశాలతో ముడిపడి...: వర్మ


తన చిన్నతనంలో అమెరికాలో విడాకుల సంఖ్య ఎక్కువ అని విన్నానని... తన దృష్టిలో విడాకులనేవి సమాజ పురోగతి,ఆర్థిక స్వాతంత్య్రంతో ముడిపడి ఉన్న అంశాలన్నారు. ఎప్పుడైనా ఒక పని అవతలి వ్యక్తి అంచనాలకు తగినట్లు చేయాలనే ఒత్తిడిని ఎవరూ తట్టుకోలేరని అన్నారు. అది ఏ రిలేషన్‌షిప్ అయినా ఇలాగే జరుగుతుందన్నారు.వైవాహిక బంధంలో ఇది ఎక్కువగా ఉంటుందని... అందుకే తాను జైలు జీవితంతో పోల్చానని అన్నారు. ఇక ఫీలింగ్ లేకుండా పెళ్లి చేసుకుని... చేసుకున్నాం కాబట్టి ఇక అందులోనే కొనసాగాలని భావించడం తమను తాము మోసం చేసుకోవడమేనని అన్నారు.

మగవాళ్లే ఎక్కువ కారణం : వర్మ

మగవాళ్లే ఎక్కువ కారణం : వర్మ


'చాలామంది మగవాళ్లు మహిళలతో రిలేషన్‌షిప్‌లో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిట్‌మెంటే ఇచ్చేస్తారు.కానీ ఆ తర్వాత దాన్ని కొనసాగించలేరు.ఆ అపరాధ భావం నుంచే ద్వేషం పుడుతుందన్నారు. ఆ పరిస్థితులే విడిపోవడానికి దారితీస్తాయి.ఒక జంట విడిపోవడంలో మగవాళ్ల పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గిపోవడం,విభేదాలు... బ్రేకప్‌కు ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న కారణాలు.' అని చెప్పారు.

సమంత చైతన్య విడాకుల ప్రకటన

సమంత చైతన్య విడాకుల ప్రకటన

మా శ్రేయోభిలాషులందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాం. నేను, సమంత భార్యాభర్తలుగా విడిపోతున్నాం. మా దారులు వేరయ్యాయి. మా ఇద్దరి మధ్య పదేళ్ల పాటు స్నేహబంధం కొనసాగింది. మా బంధంలో అదెంతో ముఖ్యంగా భావిస్తున్నాను. ఈ క‌ష్ట‌కాలంలో మీడియా,స్నేహితులు, శ్రేయోభిలాషులు మాకు అండ‌గా నిల‌వాల‌ని కోరుకుంటున్నాం. మేం ముందుకు వెళ్ల‌డానికి మాకు ప్రైవ‌సీని క‌ల్పించాల‌ని కోరుతున్నాం.' అని సమంత,చైతన్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

విడాకులకు కారణాలేంటి...

విడాకులకు కారణాలేంటి...

గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా నాగచైతన్య, సమంత విడాకుల గురించే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ విడిపోతున్నారని, విడాకుల గురించి నిర్ణయం కూడా తీసుకున్నారని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకూ సమంత గానీ చైతన్య గానీ ఎక్కడా స్పందించలేదు. చాలాకాలంగా వీరిద్దరు కలిసి ఎక్కడా కనిపించట్లేదు. ఒకరి సినిమాల గురించి ఒకరు మాట్లాడడం కూడా మానేసారు. దీంతో విడాకుల ప్రచారానికి ఇవన్నీ ఊతమిచ్చినట్లయ్యాయి. చివరకు అందరూ ఊహించినట్లే విడాకులతో ఇద్దరూ విడిపోయారు.విడాకుల కారణాలేంటన్నది ఎవరికీ తెలియనప్పటికీ ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు.

English summary
Samantha Naga Chaitnay Divorce-The divorce of the marriage of Tollywood star couple Samantha and Nagachaitanya has become a big hot topic. No one from the industry has responded so far on this couple breakup. For the first time director Rangopal Varma reacted indirectly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X