పాలేరు ఉప ఎన్నిక నగారా: రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి పోటీ
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఈ నెల 22 ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎన్నికల సంఘం జారీ చేయనుంది. 29న నామినేషన్లు వేసేందుకు చివరితేదీగా నిర్ణయించారు.
ఉపసంహరణ గడువు మే 2 వ తేదీ కాగా 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అలాగే మే 16న పోలింగ్, 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేత, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో అక్కడ ఖాళీ అయిన స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణిని కాంగ్రెసు పార్టీ బరిలోకి దించే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆ సీటును కైవసం చేసుకోవాలనే ఎత్తుగడలో ఉంది. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావును బరిలోకి దింపే యోచనలో ఉంది.
ఒక వేళ తుమ్మల నాగేశ్వర రావు కాకపోతే ఆయన కుమారుడిని పోటీకి దించే యోచనలో ఉంది. తుమ్మల నాగేశ్వర రావు ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన తెలుగుదేశం పార్టీ నుంటి టిఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవిని చేపట్టారు.












Click it and Unblock the Notifications