ఓల్డ్ సిటీకి పండగ కళ..

Ramzan 2025: ముస్లింలు జరుపుకొనే అతి పెద్ద పండుగ.. రంజాన్. నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను పాటించిన అనంతరం భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండగ సందడి ఆరంభమైంది. నెలవంక కనిపించడంతో నేటి నుంచి ఉపవాస దీక్షలు మొదలయ్యాయి.

ముస్లింలు నెల రోజుల కాలాన్ని లెక్కించడానికి క్యాలెండర్‌కు బదులుగా చంద్రుడిని ఆధారంగా తీసుకుంటారు. నెలవంక దర్శనంతో ఆరంభం అయ్యే రంజాన్ ఉపవాస దీక్షలను మళ్లీ.. చంద్ర దర్శనం తరువాతే ముగిస్తారు. ఆ మరుసటి రోజే పండగను జరుపుకొంటారు. నెల రోజుల తరువాత కూడా చంద్రుడు కనిపించకపోతే- మరో రోజు ఉపవాస దీక్షలను కొనసాగిస్తారు.

Ramzan 2025 People throng the market for shopping at Charminar Hyderabad

భారత్‌లో శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను చేపట్టారు ముస్లింలు. నెలవంక కనిపించనట్లు ఢిల్లీ జామా మసీదు ఇమామ్‌, లక్నో షాహి ఇమామ్‌ వెల్లడించారు.

రంజాన్ మాసం ప్రారంభమౌతున్న సందర్భంగా ముస్లింలకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్ తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని, ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు లభించాలని కోరుకుంటోన్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రంజాన్ చాంద్ ముబారక్ అంటూ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా- రంజాన్ చాంద్ కనిపించిన వెంటనే హైదరాబాద్ పాతబస్తీకి ఒక్కసారిగా తాకిడి పెరిగింది. మార్కెట్లన్నీ కళకళలాడాయి. షాపులు రద్దీగా మారాయి. కొనుగోలుదారులతో క్రిక్కిరిసిపోయాయి. చార్మినార్, పరిసర ప్రాంతాల్లో ఈద్ కోలాహలం కనిపించింది. జాతరను తలపించింది.

జుమా మసీదు‌ను విద్యుద్దీపాలతో అలంకరించారు. రంజాన్ ప్రార్థనల కోసం ఛాదర్లను పరిచారు. ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి షామియానాలను వేశారు. అక్కడి ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+