ఆటోలో గిరిజన యువతిపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో..
ఓ గిరిజన యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆటోడ్రైవర్ ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి ఆటోలోంచి కిందకు తోసేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండల పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
తాడ్వాయి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ గిరిజన యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. యువతి ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టి ఆటోలో నుంచి కిందకు తోసేశాడు.
ఈ సంఘటన జిల్లాలోని తాడ్వాయి మండల పరిధిలో గురువారం చోటుచేసుకుంది. గంగారం గ్రామానికి చెందిన వినోద్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతిపై తన ఆటోలో అత్యాచారయత్నం చేశాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి స్థానికుల సాయంతో తాడ్వాయి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ములుగు ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న వినోద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications