వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అరుదైన అవార్డ్. కోవిడ్ తో పాటు వరదబాదితులకు చేసిన సేవలకు గుర్తింపు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తే దానికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందంటారు పెద్దలు. రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తే అందుకు తగిన ఖ్యాతి ఖచ్చితంగా వచ్చి తీరుతుందంటారు. ఎలాంటి స్వప్రయోజనం కాంక్షించకుడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలకు పరిష్కారం చూపిస్తే రాజకీయ రంగంలోనే కాకుండా ఇతక రంగాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు సొంతంచేసుకోవచ్చని అనేక ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి అనుదైన గుర్తింపు పొందారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ" ద్వారా "స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు" ను గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా అందుకున్నారు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.

 Rare award for MLA Sudhir Reddy.Recognition for services in Covid.!

Recommended Video

Telangana: Temperature Dips, Rapidly Falling in TS

రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ సుధీర్ రెడ్డికి అందజేశారు. కరోన క్లిష్ట సమయంలోనే కాకుండా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అనేక సేవలతో పాటు, హైదరాబాద్ నగరంలో గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాల వల్ల వచ్చిన వరదల సమయంలో రాజకీయాలకు అతీతంగా, ప్రజలకు, అంధులకు, వికలాంగులకు, అనాథలకు అందించిన అపారమైన సేవలకు గాను ఈ అవార్డు వచ్చినట్టు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ అనేక రూపాల్లో అందించిన సేవలను గుర్తించిన "విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ" సుధీర్ రెడ్డి గారికి "అంతర్జాతీయ స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు" ను ఇవ్వడం జరిగిందని నిర్వహకులు స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మరియు సీఈవో సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ శ్రీమతి పూజిత, సోషల్ మీడియా ఇంచార్జ్ రమాకాంత్, ఎంఆర్ డిసిఎల్ చైర్మన్ ఓఎస్డి పగడాల శివప్రసాద్, కృష్ణ సాగర్ పాల్గొన్నారు.

English summary
The Spirit of Humanity Award was presented to the Governor, Mrs. Tamilsai Soundarajan Sudhir Reddy at a function held at Raj Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X