తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ అప్పుడే: గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి

తెలంగాణలో రేషన్​ కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల కోడ్​ ముగిసిన వెంటనే ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న రేషన్​ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి ఎక్స్(ట్విట్టర్)​ వేదికగా తెలిపారు.

అంతేగాక, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ లోగా రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని వివరించారు.

Ration Cards will be distributed after ending of elections code Minister Ponguleti Srinivas Reddy

అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివసా్ రెడ్డి పునరుద్ఘాటించారు. 'ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుండో ఆగిపోయి ఉన్న రేషన్ కార్డులు ప్రకటించిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందచేయడం జరుగుతుంది' అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి పదేళ్లు అవుతున్నా కొత్త రేషన్​ కార్డులు మాత్రం లబ్ధిదారులకు జారీ చేయకపోవడం గమనార్హం. సంక్షేమ పథకాలు ఏవైనా లబ్ధిదారుడి వరకు చేరాలంటే రేషన్​ కార్డు తప్పనిసరిగా ఉండాలి. కానీ, గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం రేషన్ ​కార్డును పదేళ్లుగా చేపట్టకపోవడం శోచనీయం. దీంతో సంక్షేమ పథకాలు అందుకునే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+