మదాపూర్‌లో రేవ్ పార్టీ: రియల్టర్లు, మహిళల అరెస్ట్
హైదరాబాద్: నగరంలో మరోసారి రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. మాదాపూర్ హైటెక్ సిటీ సైబర్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా తెలంగాణ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేశారు. 14 మంది యువకులు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
మిగిలినవారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. ఇందులో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రేవ్ పార్టీలో ఒక గ్రాము కొకైన్, రెండు గ్రాముల ఎండీఎంఏ, 0.84 గ్రాముల ఓజీ ఖుష్, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

బేగంపేట ప్రాంతానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి నాగరాజు, మరో రియల్టర్ సాయి కుమార్, బీటెక్ విద్యార్థులు, ఈవెంట్ ప్రమోటర్ కిశోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జూనియర్ డాక్టర్ల వద్ద గంజాయి: పెడ్లర్ అరెస్ట్
హైదరాబాద్ నగరం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తున్న పాత నేరస్తుడు సురేష్‌ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సురేష్ సింగ్ పై ఇప్పటికే ఐదు కేసులున్నాయి. మరోవైపు గంజాయి కొనుగోలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు కే మణికందన్, డాక్టర్ అరవింద్ లను పట్టుకున్నారు.
పట్టుబడిన జూనియర్ డాక్టర్లకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రావడంతో వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీ ఇంకా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ జూనియర్ డాక్టర్ల వద్ద నుంచి 80 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications