హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్లైట్లల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంపన్నులు నివాసముండే కాలనీల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతరాష్ట్ర ముఠాను సభ్యులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

సీసీఎస్ డీసీపీ రవివర్మ కథనం ప్రకారం.... ఉత్తరప్రదేశ్ బిజ్‌నూర్ జిల్లాకు చెందిన మహ్మాద్ రజ్వీ అలియాస్ కాఫ్‌తాన్ (49), షాదాబ్ అలీ (37), నౌషద్ అహ్మాద్ (34), మహ్మాద్ ఆరిఫ్ (40), మహ్మాద్ రాషీద్ (38), నాసిర్ ముఠాగా ఏర్పడి 1999 నుంచి చోరీలు చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి ఈ ముఠాను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు నాసిర్ పరారీలో ఉన్నాడు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.

 విమానాల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే

విమానాల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే

హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, పూణె, నాసిక్, చెన్నై, బెంగుళూరు, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లో సంపన్నుల కాలనీలలో పగటిపూట తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి తమ పని కానిస్తేంటారు.

విమానాల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే

విమానాల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే


పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన వీరు, బయటకు వచ్చాక మళ్ళీ పాత దందానే కొనసాగిస్తున్నారు. అరెస్టై, తిరిగి బెయిల్‌పై బయటికి వచ్చి చోరీలు చేస్తున్నారు.

 విమానాల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే

విమానాల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే


వీరంతా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విమానాలు, రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ల్యాప్ టాప్ బ్యాగ్‌లో స్క్రూడైవర్, ఐరన్ రాడ్, స్క్రూలు, నట్లు, బోల్టులు వేసుకొని వెళ్తారు. ఇంటి తాళాలు బద్దలు కొట్టి చోరీ చేస్తారు.

 విమానాల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే

విమానాల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే


రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు వీరి బ్యాగ్‌ను తనిఖీ చేస్తే తాము కార్పెంటర్లమని, పని నిమిత్తం వెళ్తున్నామని చెప్తారు. బస్టాప్, రైల్వే స్టేషన్ల సమీపంలోని లాడ్జిల్లో బస చేసే వీరు తమ పని ముగిసిన వెంటనే మరో ప్రాంతంలో చోరీ చేస్తారు.

విమానాల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే

విమానాల్లో వచ్చే యూపీ దర్జా దొంగలు వీరే

దొంగిలించిన సొత్తును దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లకే విక్రయిస్తారు. అంతే కాకుండా సొత్త తర్వాత ఇస్తామని డబ్బు అడ్వాన్స్ గా కూడా తీసుకొంటారు. వీరు ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 15, తిరుపతిలో 4, నాసిక్‌లో 4 ముంబైలో 5, చెన్నైలో 2 దొంగతనాలు చేశారు.

English summary
Ravi Varma, DCP Detective Department addressing Media at CCS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X