సిసి కెమెరాల పుటేజీ ఇవ్వండి, బ్యాంకులకు ఆర్ బి ఐ ఆదేశం, అక్రమాలు బయటపడతాయి ఇలా

బ్యాంకు సిసి కెమెరాల పుటేజీలను ఇవ్వాలని ఆర్ బి ఐ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకులను ఆదేశించింది. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాంకులోని సిసి

హైదరాబాద్ : పెద్ద నగదు నోట్లు రద్దు చేసిన తర్వాత అక్రమార్కులకు ఎవరెవరు సహకరించారనే విషయాన్ని తేల్చేందుకు ఆర్ బి ఐ సన్నద్దమైంది. ఆయా బ్యాంకుల్లోని సిసి కెమెరాల పుటేజీలను తమకు అందివ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంకు నుండి ఈ మేరకు నోటీసులు అందాయి.

అక్రమార్కులకు బ్యాంకర్లు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు బ్యాంకర్లు నల్లధనాన్ని మార్చుకొనేందుకు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ప్రచారం కూడ ఉంది. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకుల సిసి పుటేజీలను పరిశీలించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.

బ్యాంకుల్లోని లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించేందుకుగాను ఆర్ బి ఐ సిసి పుటేజీల వివరాలను అడిగింది. ఈ వివరాల అధారంగా అనుమానాలు ఉన్నఖాతాలను , బ్యాంకుల, వ్యక్తుల సమాచారాన్ని తనిఖీ చేసే అవకాశం ఉంది.

ఈ నోటీసుల ఆధారంగా సిసిపుటేజీల సమాచారాన్ని బ్యాంకులు ఆర్ బి ఐ కి పంపనున్నారు. ఈ సమాచారం ఆధారంగానే బ్యాంకుల్లో చోటుచేసుకొన్న అక్రమాలను గుర్తించే అవకాశం ఉందని ఆర్ బి ఐ భావిస్తోంది.

సిసి పుటేజీల రికార్డులతో ఏం చేస్తారు

సిసి పుటేజీల రికార్డులతో ఏం చేస్తారు

ప్రతి బ్యాకుంలో సిసి కెమెరాలున్నాయి. బ్యాంకుల్లో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు గాను సిసికెమెరాలను ఏర్పాటు చేశారు. ఒకవేళ బ్యాంకులో ఏదైన అవాంఛనీయ సంఘటలను చోటుచేసుకొన్నా సిసికెమెరాల ద్వారా వాటిని బయటపెట్టే అవకాశం ఉందని సిసికెమెరాలను ఏర్పాటుచేశారు.పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలపై కొన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కోట్లాది రూపాయాలు అక్రమార్కులు మార్పిడి చేసుకొంటున్నారు. ఈ విషయాలు వెలుగుచూడడంతో సిసి కెమెరాల పుటేజీలను పరిశీలించాలని ఆర్ బి ఐ నిర్ణయం తీసుకొంది. ఈ పుటేజీ ఆధారంగా ఆయా బ్యాంకులు, ఖాతాలు, వ్యక్తులను తనిఖీ చేసే అవకాశం ఉంది.

కొందరికే ఎక్కువ మొత్తంలో నగదు ఎలా చేరుతోంది

కొందరికే ఎక్కువ మొత్తంలో నగదు ఎలా చేరుతోంది

ప్రతిరోజూ బ్యాంకుల చుట్టూ, ఎటిఎంల చుట్టూ తిరిగినా కాని రెండు వేల రూపాయాలు దొరకడం కష్టమౌతోన్న తరుణంలో, కొందరికి మాత్రం లక్షల రూపాయాల కొత్త కరెన్సీ మాత్రం దక్కుతోంది. దీనికి బ్యాంకు అధికారులు సహాకారం ఉందనే ఆరోపణలు కూడ ఉన్నాయి. లక్షలాది రూపాయాల కొత్త కరెన్సీ బడాబాబులకు చేరుతున్నాయి. ప్రజల నుండి ఈ విషయమై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సిసి పుటేజీ రికార్డులను పరిశీలించాలని ఆర్ బి ఐ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం మేరకు ఆయా బ్యాంకులకు నోటీసులను జారీ చేసింది ఆర్ బి ఐ, ఈ నోటీసుల ఆధారంగా ఆయా భ్యాంకులు సిసిపుటేజీని పంపనున్నాయి.

అక్రమాలకు పాల్పడిన బ్యాంకర్లకు ఇబ్బందులు తప్పవా

అక్రమాలకు పాల్పడిన బ్యాంకర్లకు ఇబ్బందులు తప్పవా

సిసి పుటేజీ ఆధారంగా ఆర్ బి ఐ చర్యలు తీసుకొంటే అక్రమాలకు పాల్పడిన బ్యాంకర్లపై చర్యలు తప్పకపోవచ్చు. ఇటీవలనే డిల్లీని కొన్ని బ్యాంకుల్లో నకిలీ ఖాతాలున్నట్టు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయాలను జమ చేశారు. అయితే నల్లధనం మార్పిడి కోసం ఏ రకంగా అక్రమార్కులు ఏ రకంగా వ్యవహారించారో సిసి పుటేజీలో రికార్డు అయ్యే అవకాశం ఉంది. దీని ఆధారంగా బ్యాంకర్లపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాంకు పని చేసిన రోజుల్లోని పుటేజీని రికార్డు చేసి ఇవ్వాలని బ్యాంకర్లను ఆర్ బిఐ ఆదేశించింది.

పనితీరులో మార్పు వస్తోందా

పనితీరులో మార్పు వస్తోందా


బ్యాంకుల్లోని సిసిపుటేజీని ఆర్ బి ఐ కోరిన మీదట బ్యాంకుల పనితీరులో మార్పు వచ్చే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. కమీషన్ల కోసం కొందరు సామాన్యులకు నగదు ఇవ్వకుండా ఇతరులకు నగుదను ఇచ్చిన ఘటనలను చూశాం. అక్రమార్కులు నేరుగా తమ పనులను పూర్తిచేసుకొంటున్న ఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సిసి కెమెరాల పుటేజీ ఆధారంగా ఆర్ బి ఐ చర్యలు తీసుకొంటుందనే భయంతో బ్యాంకు అధికారులు అక్రమార్కులకు సహకరించే అవకాశం ఉండకపోవచ్చును. అయితే కొత్త కరెన్సీ కోసం ఇప్పటికే బ్యాంకులపై ఖాతాదారుల ఒత్తిడి తీవ్రంగా ఉంది. డిమాండ్ మేరకు కొత్త కరెన్సీ అందుబాటులో లేదు. ఈ కారణాలన్నింటి దృష్ట్యా సిసి కెమెరాల పుటేజీని కూడ ఇవ్వడం అనేది తమపై మరింత పనిభారాన్ని పెంచే అవకాశం ఉంది బ్యాంకు అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే సిసి కెమెరాల పుటేజీని పంపకపోతే తప్పడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో పని భారమైనా సరే పుటేజీని పంపేందుకు బ్యాంకర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది.

లక్షల్లో ఫిర్యాదులు

లక్షల్లో ఫిర్యాదులు

బ్యాంకుల్లో జరిగిన మోసాల ఆర్ బి ఐ కి భారీగానే ఫిర్యాదులు వచ్చాయి. ఆర్ బి ఐ ఈ మెయిళ్ళ విభాగానికి సుమారు 30 లక్షల పైగా ఈ మెయిల్ ఫిర్యాదులు వచ్చినట్టు ఆర్ బి ఐ అధికారులు చెబుతున్నారు. కొందరు బ్యాంకుల్లో జరిగిన అవకతవకలను తమ సెల్ ఫోన్లలో రికార్డు చేసి మరీ పంపించారు. బ్యాంకుల వద్ద నగదు అందక వృద్దులు, మహిళు పడుతున్న భాదలను కూడ కొందరు వీడియోల రూపంలో పంపారు.క్యూ లైన్లలో ఉన్న ఖాతాదారులపై పోలీసుల దౌర్జన్యాన్ని కూడ కొందరు తమ సెల్ పోన్లలో రికార్డుచేసి పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+