Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆరంభం మాత్రమే... ప్రాణత్యాగాలకైనా సిద్ధమే... ఎల్ఐసి మేనేజ్‌మెంట్‌కు ఏజెంట్ల హెచ్చరిక...!

హైదరాబాద్ : ఎల్‌ఐసి ఏజెంట్లు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉధృతమవుతున్నాయి. ఎల్‌ఐసి ఏజెంట్ యూనియన్ సంఘాల ఆల్ ఇండియా జేఏసీ పిలుపు మేరకు దేశమంతటా నిరసన పోరాటం కొనసాగుతోంది. 6వ తేదీ మంగళవారం డివిజనల్ కార్యాలయాల్లో మహాధర్నాకు జేఏసీ పిలుపునివ్వడంతో ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏజెంట్ల ఐక్యతను చాటేలా, ఆవాజ్ దో... హమ్ ఏక్ హై అంటూ నినదించారు. మేనేజ్‌మెంట్‌కు తెలిసి వచ్చేలా తమ డిమాండ్లను నినాదాల రూపంలో చాటి చెప్పారు. ఇప్పటికైనా మేనేజ్‌మెంట్ బెట్టు వీడి మెట్టు దిగాలని... తాము శాంతియుత ధోరణిలో నిరసన తెలుపుతుంటే చాతకానితనంగా భావించొద్దని... అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనంటూ హెచ్చరించారు.

ఏజెంట్ల ఐక్యతారాగం... మహాధర్నా విజయవంతం..!

ఏజెంట్ల ఐక్యతారాగం... మహాధర్నా విజయవంతం..!

నగరం నడిబొడ్డున గల హైదరాబాద్ డివిజనల్ కార్యాలయంలో తలపెట్టిన మహాధర్నా విజయవంతమైంది. వివిధ బ్రాంచుల నుంచి వందలాది సంఖ్యలో తరలివచ్చిన ఏజెంట్లు... మేనేజ్‌మెంట్ దిగొచ్చేంత వరకు తాము సంఘటితమై పోరాడతామని హెచ్చరించారు. వేదికను అలంకరించిన యూనియన్ పెద్దలు... ఎల్ఐసి పట్ల ప్రభుత్వాల వైఖరి... ఏజెంట్ల పట్ల మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని మండిపడ్డారు.

శాంతియుత ధోరణిలో తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని... ఇకపై తమను లెక్కచేయకుండా వ్యవహరిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 5వ తేదీ సోమవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో జీరో రిసీట్... నో క్యాష్ ట్రాన్సక్షన్స్ జరగడం ఏజెంట్ల ఐక్యతకు నిదర్శనమని తెలిపారు. పాలసీదారులు కూడా తమకు సహకరించడం గొప్ప పరిణామమని చెప్పుకొచ్చారు.

మేనేజ్‌మెంట్ దిగి రావాలి... చిన్నచూపు చూస్తే అంతే సంగతి...!

మేనేజ్‌మెంట్ దిగి రావాలి... చిన్నచూపు చూస్తే అంతే సంగతి...!

తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ... ఎల్ఐసి ఏజెంట్లు తలపెట్టిన శాంతియుత ఆందోళన కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి. 6వ తేదీ మంగళవారం నాడు డివిజనల్ ఆఫీసుల్లో చేపట్టిన మహాధర్నాకు పెద్ద సంఖ్యలో ఏజెంట్లు తరలివచ్చారు. ఆ క్రమంలో హైదరాబాద్ డివిజనల్ కార్యాలయంలో జరిగిన మహాధర్నాకు వివిధ బ్రాంచుల నుంచి వందలాది ఏజెంట్లు హాజరయ్యారు.

ఇన్సూరెన్స్ రంగంలో దిగ్గజమైన ఎల్‌ఐసికి... ఏజెంట్ సోదరులే పునాదులని... అలాంటి తమను మేనేజ్‌మెంట్ విస్మరించడం తగదని యూనియన్ నేతలు హెచ్చరించారు. ఎల్ఐసికి వారధిగా నిలుస్తున్న ఏజెంట్లను చిన్నచూపు చూడటమంటే సంస్థను గౌరవించనట్లేనని ధ్వజమెత్తారు. శాంతియుత ధోరణిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఆరంభం మాత్రమేనని... కాదు కూడదంటే ఎంతకైనా తెగిస్తామని చెప్పుకొచ్చారు. మేనేజ్‌మెంట్ మెట్టు దిగి రాకుండా బెట్టు చేస్తే... ప్రాణత్యాగాలకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ఒక్కటైన యూనియన్లు... ఒకే వేదికగా ఆందోళన పర్వం

ఒక్కటైన యూనియన్లు... ఒకే వేదికగా ఆందోళన పర్వం

దేశమంతటా ఎల్ఐసి ఏజెంట్ యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి ఆల్ ఇండియా జేఏసీగా ఏర్పడ్డాయి. విభజించు, పాలించు ధోరణిలో మేనేజ్‌మెంట్ అవలంభిస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకే జేఏసీగా ఏర్పడ్డామని చెబుతున్నారు యూనియన్ లీడర్లు. ఇకపై తమదంతా సమైక్య రాగమని... ఏజెంట్లకు న్యాయం జరగడమే పరమావధిగా ముందుకెళతామని స్పష్టం చేశారు. అందులోభాగంగానే ఒకే దేశం, ఒకే సమాఖ్య, ఒక్క ఆందోళన నినాదంతో ఆల్ ఇండియా జేఏసీ ఆందోళన కార్యక్రమాలకు నాంది పలికినట్లు తెలిపారు. ఏజెంట్లు లేనిదే ఎల్ఐసి లేదని... అలాంటిది తమను కాదని తమపైనే కుట్రలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

ఇక తమ పోరాటం ఆగదని... ఇకనైనా మేనేజ్‌మెంట్ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఏజెంట్ యూనియన్ల ఆల్ ఇండియా జేఏసీ పిలుపు మేరకు... 5వ తేదీ సోమవారం నాడు హైదరాబాద్ డివిజన్ పరిధిలోని ఇరవైకి పైగా బ్రాంచుల్లో ఏజెంట్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పాలసీల రెన్యూవల్స్, ప్రీమియం చెల్లించడం, ల్యాప్స్ ఐన పాలసీల పునరుద్ధరణ లాంటి సేవల నిమిత్తం ఆయా బ్రాంచులకు వచ్చిన కస్టమర్లకు తమ గోడు వినిపించడంతో... మా సపోర్టు మీకే అంటూ వారు వెనుదిరిగిపోయారు. దీంతో ఎల్‌ఐసి కౌంటర్లు బోసిపోయి కనిపించాయి.

పాలసీదారులకు కూడా మేలు జరగాలి...!

పాలసీదారులకు కూడా మేలు జరగాలి...!

ఏజెంట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం, ఏజెంట్ల పిల్లలకు విద్యారుణాలు ఇవ్వడం, గ్రాట్యూటీ లెక్కింపు విధానం మార్చడం, గ్రాట్యూటీ పెంచడం, గ్రూప్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ పెంచడం, ఐఆర్‌డీఎ ప్రకారం కమిషన్ స్ట్రక్చర్ పునర్నిర్మాణం చేయడం లాంటి న్యాయసమ్మతమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే గుర్తించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని... ఎంతకైనా తెగిస్తామని హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఎల్‌ఐసి ఏజెంట్లు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పాలసీదారులకు కూడా మేలు జరగాలన్నది వారి అభిమతం. ఆ క్రమంలో పాలసీలపై బోనస్ పెంచడం... పాలసీ లోన్ వడ్డీ రేట్లు తగ్గించడం... పాలసీదారులకు సమర్థవంతమైన సేవలందించడం... బ్రాంచుల్లో పౌరుల చార్టర్ ప్రదర్శించడం... ఐదేళ్లకు పైబడి ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించడం లాంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. పాలసీలపై బోనస్ పెంచడం ద్వారా కస్టమర్లకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. అలాగే పాలసీ మూడేళ్లు పూర్తయిన తర్వాత ఇచ్చే లోన్లపై ప్రస్తుతమున్న వడ్డీ రేట్లు తగ్గించడం ద్వారా పాలసీదారులకు మేలు జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+