హైదరాబాద్‌లో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ దారుణ హత్య
హైదరాబాద్ నగర శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణ హత్యకు గురయ్యారు. షాద్‌నగర్‌లోని తన ఫాంహౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. కిరాతకంగా కృష్ణను కత్తులతో నరికి చంపారు. ఆ తర్వాత నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు.
హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షాకోట్ కు చెందిన కమ్మరి కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కన్వెన్షన్ సెంటర్లు, ఫాంహస్ నిర్మాణాలు చేస్తూ కేకేగా గుర్తింపు పొందారు.

షాద్ నగర్ సమీపంలోని కమ్మదానంలో ఉన్న తన సొంత కేకే ఫాంహౌస్‌లో ఉండగానే.. నిందితులు రెక్కీ నిర్వహించి, పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన కృష్ణను చికిత్స కోసం శంషాబాద్ లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో కేకే ప్రాణాలు కోల్పోయారు.
హత్య ఎందుకు చేశారు? ఎవరు చేశారనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవలా? లేక ఆర్థిక లావాదేవీలా లేక వ్యక్తిగత వ్యవహారాల అనేది తేలాల్సి ఉంది.
నిందితుడి అరెస్ట్
రియల్టర్ కమ్మరి కృష్ణను దారుణంగా హత్య చేసిన నిందితుడు బాబాను శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .అనంతరం నిందితుడ్ని షాద్‌నగర్ పోలీసులకు అప్పగించారు. భూ వివాదాల కారణంగానే ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications