ఫ్యామిలీ షాక్: పట్టపగలు హైదరాబాదులో రియల్టర్ కిడ్నాప్
హైదరాబాద్: పట్టపగలు హైదరాబాదులో ఓ రియల్టర్ అపహరణకు గురయ్యారు. కూరగాయలకు వెళ్లి వస్తున్న అనంతయ్య అనే రియల్టర్‌ను నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి కారులో తీసుకుని వెళ్లారు.
అనంతయ్య గతంలో నల్లగొండ జిల్లాలో ఓ గ్రామానికి సర్పంచ్‌గా కూడా పనిచేశారు. కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది తెలియడం లేదు. తమకు ఎవరూ శత్రువులు లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కిడ్నాపర్లను పట్టుకోవడానికి పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కిడ్నాపర్లు ఎవరనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications