ఆల్‌టైమ్ రికార్డ్: ఎకరం రూ.151.25 కోట్లు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్‌లో హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డు సృష్టించింది. కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. గోల్డెన్ మైల్‌లోని ప్లాట్ నెంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు అమ్ముడుపోవడం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ భూములను జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా ఈ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ప్లాట్ నెంబర్ 15లోని 4.03 ఎకరాలకు మొత్తం రూ.609.55 కోట్లు హెచ్ఎండీఏకు లభించాయి.

ప్లాట్ నెంబర్ 16లో ఉన్న భూములకు దీని కంటే కొంచెం తక్కువ ధర పలికింది. ఈ ప్లాట్‌లో ఎకరానికి రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలను వేలం వేయగా.. ప్రభుత్వానికి రూ.1,353 కోట్ల ఆదాయం లభించింది.కోకాపేట నియోపోలిస్‌లో హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న భూముల వేలం ఈ మధ్య పెట్టుబడిదారుల మధ్య పోటీని మరింత పెంచింది. కోకాపేట ప్రాంతం అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలో ఉండటం కారణంగా రియల్ ఎస్టేట్ డెవలపర్‌లకు అత్యంత ఆకర్షణీయంగా మారింది. ఈసారి వేలంలో రెండు ప్లాట్లు రికార్డు ధర పలికాయి.

Record-Breaking Sale in Kokapet Land Fetches Rs 151 25 Crore per Acre in Hyderabad

ఇదిలా ఉండగా.. ఇటీవల రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్‌లో ఇటీవల నిర్వహించిన భూముల ఈ-వేలంలో ఎకరం ధర అద్భుతమైన రికార్డు స్థాయిలో రూ. 137.25 కోట్లు పలికింది. హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం సమకూరింది. ఇటీవలే సర్వే నెంబర్ 17,18లో భూములకు వేలం నిర్వహించారు. సర్వే నెంబర్ 17లోని ఎకరం భూమి ధర రూ.137.25 కోట్లు పలికింది. ఇందులో ముందుగా ఎకరానికి కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించారు. మొత్తం 9.90 ఎకరాల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ. 1,356 కోట్లకు పైగా భారీ ఆదాయం సమకూరింది.

రియల్ ఎస్టేట్ వృద్ధికి సంకేతం
కోకాపేటలో రికార్డు ధరలు పలకడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పటిష్టతను, స్థిరత్వాన్ని మరోసారి రుజువు చేసింది. 2023లో ఇదే నియోపోలిస్ లేఅవుట్‌లో జరిగిన వేలంలో ఎకరం భూమి అత్యధికంగా రూ. 100.75 కోట్లు పలికింది. తాజా వేలంలో అత్యధిక ధర సుమారు 36 శాతం ఎక్కువగా పలికింది. రెండేళ్ల క్రితం సగటు ధర రూ.73 కోట్లతో పోలిస్తే భారీ వృద్ధిని నమోదు చేసింది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, ఒడిదుడుకులు లేకుండా పురోగమిస్తున్న మార్కెట్లలో హైదరాబాద్ ఒకటని ఈ వేలం ద్వారా మరోసారి రుజువైంది. తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం, కోకాపేట వంటి ప్రాంతాలలో భూముల వేలం ద్వారా స్థిరంగా భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటూ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమకూర్చుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+