''బేటీ బచావో, బేటీ పడావో ' కు మాళోత్ పూర్ణను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలి''
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన లంబాడా బాలిక మాలావత్ పూర్ణను 'బేటీ బచావో, బేటీ పడావో ' పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ఎంపీ సీతారాం నాయక్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్:ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన లంబాడా బాలిక మాలావత్ పూర్ణను 'బేటీ బచావో, బేటీ పడావో ' పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ఎంపీ సీతారాం నాయక్ డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు ఆయన లోక్ సభ జీరో అవర్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. పూర్ణతో పాటు మరో బాలుడు ఆనంద్ కుమార్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారని ఆయన గుర్తు చేశారు.
అతి చిన్న వయస్సుల్లోనే ఎవరెస్టు అధిరోహించిన మాలోత్ పూర్ణ, ఆనంద్ కుమార్ తెలంగాణతో పాటు, దేశానికి మంచి పేరు తెచ్చారని ఆయన చెప్పారు.

బేటీ బచావో, బేటీ పడావో నినాదదంతో బాలికలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి చిన్న వయస్సులోనే హిమాలయ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించడం ద్వారా గుర్తింపునివ్వాలని కోరారు.
బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ పూర్ణ జీవితంపై నిర్మించిన చలన చిత్రం ప్రత్యేక ప్రదర్శనను పార్లమెంట్ సభ్యుల కోసం ఏర్పాటు చేయాలని ఆయన స్పీకర్ ను కోరారు.












Click it and Unblock the Notifications