Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రెడ్ అలర్ట్, వారికి అనుమతి లేదు
దేశ వ్యాప్తంగా జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భద్రతా బలగాలు అప్రమత్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘావర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జనవరి 30 వరకు ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని తెలిపారు.
అంతేగాక, జనవరి 30 వరకు శంషాబాద్ విమానాశ్రయంకు సందర్శకులు ఎవరూ రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎయిర్‌పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. విమానాశ్రయానికి వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపి తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
ఎయిర్ పోర్టుకు వచ్చే సందర్శకులకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో సందర్శకులు ఎవరూ కూడా ఈ నెల 30 వరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సందర్శన కోసం ఎవరు కూడా వెళ్లకుండా ఉండటం మంచిది. మరోవైపు, జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications