జ్యూస్ తాగుదామని తీసుకెళ్లి!: పాతబస్తీలో బాలుడి దారుణ హత్య..

పాతబస్తీలో ఓ బాలుడు(7) దారుణంగా హత్యకు గురయ్యాడు. పండ్ల రసం తాగుదామని తీసుకెళ్లి సమీప బంధువే బాలుడిని హత్య చేసినట్లు తేలింది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్: పాతబస్తీలో ఓ బాలుడు(7) దారుణంగా హత్యకు గురయ్యాడు. పండ్ల రసం తాగుదామని తీసుకెళ్లి సమీప బంధువే బాలుడిని హత్య చేసినట్లు తేలింది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ రెయిన్‌బజార్‌కు చెందిన అబ్బాస్‌ హసన్‌ రజ్వీ కుమారుడు షబ్బీర్‌ను అతని సమీప బంధువు జావేద్‌ జ్యూస్ తాగుదామని బయటకు తీసుకెళ్లాడు. అలా.. బాలుడిని డబీర్‌పురలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బండరాయితో తలపై కొట్టి చంపాడు.

relative murders 7years old in suspected revenge killing

హత్యానంతరం ఏమి తెలియనివాడిలా అక్కడినుంచి వెళ్లిపోయాడు. బాలుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. జావేద్‌పై వారికి అనుమానం కలిగింది. సీసీటివి ఫుటేజీ సహాయంతో అతనే హత్య చేసినట్లు నిర్దారణకు వచ్చారు.

కాగా, రెండేళ్ల క్రితం జావేద్ కుమారుడు అమీర్ సంపులో పడి చనిపోయాడు. అయితే అబ్బాస్ కుటుంబమే దానికి కారణమని జావేద్ అనుమానించాడు. రెండేళ్లుగా అదే కక్షతో రగిలిపోతున్న జావేద్.. ఇలా సందర్భం కోసం ఎదురుచూసి బాలుడిని హత్య చేశాడు.

జావేద్‌ను అదుపు లోకి తీసుకుని విచారించగా ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. బాలుడి తండ్రితో ఉన్న పాత కక్షలే హత్యకు దారి తీశాయని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+