కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రైలు రోకో కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ విచారణపై కోర్టు స్టే విధించింది. విచారణను జులై 23కు వాయిదా వేసింది. మరోవైపు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

కాగా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్‌లో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారంటూ మల్కాజిగిరి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. తాను ఎలాంటి రైల్ రోకోకు పిలుపునివ్వలేదని పిటిషన్‌లో తెలిపారు.

Relief to KCR in Rail Roko case in high court

ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. రైల్ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ ఏర్పడిందని, ఈ కేసుకు ఎలాంటి బలం లేదని ఆయన తెలిపారు. కేసును కొట్టేయాలని కేసీఆర్ పిటిషన్ వేయడంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యుత్ కమిషన్‌పై హైకోర్టుకు కేసీఆర్

విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్​‌ను రద్దు చేయాలని కోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ వేశారు.

కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని వ్యాజ్యంలో కేసీఆర్ పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలిపారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.ఈ కేసులో విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం అధికారులను ప్రతివాదులుగా కేసీఆర్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+