సెటిలర్లను కేసీఆర్, కేటీఆర్ ఎన్ని మాటలన్నారో గుర్తుందిగా?
మాగంటి గోపీనాథ్ మరణ వెనుక ఏం జరిగింది? ఎవరున్నారు? గోపీనాథ్ పల్లి చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఎవరు చెబుతారు? గోపీనాథ్ మొదటి భార్య కుటుంబం నుంచి కాకుండా రెండో భార్యను కేసీఆర్ ఎందుకు పోటీకి నిలబెట్టారు? సునీత రెండో భార్య అని తెలిసినప్పటికీ టీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి తో మరో నామినేషన్ ఎందుకు వేయించారు? గోపీనాథ్ తల్లిని ఎందుకు ఆసుపత్రిలోకి అనుమతించలేదు? ఉపఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో గోపీనాథ్ మరణం మిస్టరీగా ఎందుకు మారింది? కేటీఆర్ పై గోపీనాథ్ తల్లి చేస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించడంలేదు? కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ మాట్లాడకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
టీడీపీ మీద పడి బతుకుదామనా?
భారత రాష్ట్ర సమితికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చావు బతుకుల సమస్యగా మారింది. సాధారణంగా రెండు సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్ దాటి బయటికి రాని కెసిఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నంది హిల్స్ లో కూర్చుని రాజకీయం చేస్తున్నారు. ఆ పార్టీకి గెలుపు తప్పనిసరి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేని ఆ పార్టీ ప్రస్తుతం వెంటిలేషన్ మీద ఉంది. లేదంటే ఒకరకంగా చచ్చిపోయిందని చెప్పొచ్చు.

జూబ్లీహిల్స్ లో గెలిస్తే కనుక మళ్ళీ ప్రాణం పోసినట్లు అవుతుంది.. చంద్రబాబును అడ్డం పెట్టుకొని.. సెటిలర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటానికి అవకాశం కలుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన సెటిలర్లు ఓట్లేయాలా? లేదా? అనే నిర్ణయాన్ని వారే సొంతంగా తీసుకోవాలి. కొన్ని సంవత్సరాలుగా సెటిలర్లను కేసీఆర్, కేటీఆర్ ఎన్నెన్ని మాటలన్నారో గుర్తుందిగా.
మాగంటి గోపీనాథ్ డబ్బు ఖర్చుపెడుతున్నారా?
జూబ్లీహిల్స్ లో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఉత్తేజంగా పనిచేస్తారని కెసిఆర్ భావిస్తున్నారు. ఇక్కడ గెలుపు కోసం డబ్బులు వెదజల్లుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి డబ్బులు పంచగలుగుతుంది. కానీ కేవలం గత ఆర్థిక సంవత్సరంలో పార్టీకి విరాళంగా కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టగలిగిన బిఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎక్కడి నుంచి డబ్బు తెచ్చిపెడుతోంది? మొత్తం మాగంటి గోపీనాథ్ డబ్బే నా? బిజెపి నేతలు ఆరోపిస్తున్నట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు మాగంటి గోపీనాథ్ ఆస్తుల కోసం భారత రాష్ట్ర సమితి ప్రయత్నం చేస్తోందా? అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది.
దీనికి సమాధానం చెప్పాల్సిన ఆ పార్టీ నాయకత్వం స్పందించడం లేదు. ముస్లింలు, సెటిలర్లు వేసే ఓట్లను బట్టి ఇక్కడ అభివృద్ధి, విజయం ఆధారపడి ఉన్నాయి. ఈ రెండు వర్గాలు ఎటువైపు మొగ్గుతారో చూడాలి. లేదంటే ఇక్కడ గెలుపును మాగంటి గోపీనాథ్ మరణం, మాగంటి గోపీనాథ్ డబ్బు నిర్దేశిస్తాయా? అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 14వ తేదీ వరకు వేచిచూడాల్సి ఉంది.!
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications