హాఫ్ ఫోటో చూసి అంటారా?: రేణుకా చౌదరి కూతురు కౌంటర్
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి పైన నెటిజన్ల విమర్శలకు ఆమె కూతురు తేజస్విని ధీటుగా సమాధానం చెప్పారు. తన తల్లి పైన అనవసరంగా నిందలు వేస్తున్నారని తేజస్విని ఆవేదన వ్యక్తం చేశారు.
తన తల్లి పైన సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు సరికాదన్నారు. ఓ రెస్టారెంటుకు వెళ్లిన రేణుక కుటుంబం.. పనమ్మాయిని పక్కనే నిలబెట్టి భోజనం చేస్తున్నట్లు ఓ ఫోటో నెట్లో వైరల్ అయింది. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తేజస్విని స్పందించారు.
విషయం తెలుసుకోకుండా, సగం ఫోటో చూసి నిందలు వేయడం సరికాదని తేజస్విని అన్నారు. పనమ్మాయిని తన కోసమే నిమమించారని, ఆమె బాలిక కాదని, 26 ఏళ్ల వయస్సు మహిళ అన్నారు. ఆమెకు 9, 7 ఏళ్ల వయస్సు పిల్లలు ఉన్నారని చెప్పారు. ఆమె కూడా రెస్టారెంటులో తమతో పాటు భోజనం చేసిందన్నారు.

మా అమ్మ అందర్నీ సమానంగా చూస్తుందని, తన చుట్టు ఉన్న వారి అవసరాలను స్వయంగా తెలుసుకొని తీరుస్తుందని చెప్పారు. ధైర్యం, విశ్వాసం, దయాగుణం కలిగిన అమ్మ ఇప్పటికీ ప్రజల కోసం పని చేస్తోందని, అలాంటి తన తల్లిపై నిందలు సరికాదన్నారు.
ఆమె సహాయం పొందిన వారిలో చాలామందికి ట్విట్టర్ ఖాతాలు లేవన్నారు. హాఫ్ ఫోటో చూసి విమర్శలు చేయడం సరికాదన్నారు. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎదుటివారిని బాధపెట్టే వ్యాఖ్యలు చేయవద్దని నెటిజన్లకు హితవు పలికారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications