టీడీపీ ఎంపీలకు అకాలీదళ్ మద్దతు, హోదా ఇవ్వాలని రేణుక చౌదరి, కేకే కూడా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎన్డీయే సంకీర్ణంలో టీడీపీ భాగస్వామిగా ఉంటూ ఏపీకి న్యాయం చేయాలని అడగడం సిగ్గుచేటు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో మండిపడ్డారు. న్యాయం చేయలేదని భావిస్తే పదవుల నుంచి తప్పుకోవాలన్నారు.

వీరి తీరు ఘోరం, ఇందుకేనా, తేల్చుకుందాం: మోడీ-జైట్లీపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

శుక్రవారం రాజ్యసభలో ఏపీ ఎంపీల ఆందోళనకు అకాలీదళ్, టీఆర్ఎస్ ఎంపీ కే కేశవ రావులు మద్దతు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రేణుకా చౌదరి కూడా సూచించారు.

Renuka Chowdhury demands Special Status for Andhra Pradesh

రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలన్నారు. ఇదే సభలో హామీలు ఇచ్చామని, ఆ హామీలు అమలు చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏం అడ్డంకి వచ్చిందని ప్రశ్నించారు.

టీడీపీ ఎంపీల ఆందోళనకు అకాలీదళ్ మద్దతు పలికింది. ఏపీ డిమాండ్లను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరిశీలించాలని అకాలీదళ్ విజ్ఞప్తి చేసింది. విభజన హామీల మేరకు ప్యాకేజీలో అంశాలను చేర్చాలని చెప్పారు.

మరోవైపు, ఏపీ ఎంపీలకు టీఆర్ఎస్ ఎంపీ కే కేశవ రావు కూడా మద్దతు తెలిపారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. చట్టంలోని వాటిని అమలు చేస్తామంటే అభ్యంతరం చెప్పేందుకు మేం ఎవరమని అడిగారు. అలాగే తెలంగాణకు రావాల్సిన హామీలు కూడా నెరవేర్చాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress MP Renuka Chowdhury demanded Special Status for Andhra Pradesh in Rajya Sabha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి