కొత్త రేషన్ కార్డు దారులకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు తీసుకుంటున్న వారికి శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా రేషన్ కార్డులు తీసుకునేవారు ప్రభుత్వ పథకాలను ఇప్పటివరకు అందక ఇబ్బందులు పడుతున్న వారు, సంక్షేమ పథకాల కోసం ఎవరిని సంప్రదించాలో దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో తెలియని వారికి శుభవార్త చెబుతోంది.
సంక్షేమ పథకాలకు రేషన్ కార్దులే ప్రామాణికం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగిస్తోంది. ఎంతోకాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంది.

కొత్త రేషన్ కార్డులు తీసుకునే వారికి స్పెషల్ డ్రైవ్
సంక్షేమ పథకాలు కావాలని కోరుకునేవారు రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, చేయూత వంటి పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు తీసుకుంటున్న వారి కోసం ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని భావిస్తుంది.
అధికారులే నేరుగా వారి ఇళ్ళకు వెళ్లి వివరాల నమోదు
దీనిద్వారా సంక్షేమ పథకాలను మరింత సులభతరం చేసి సామాన్యులకు అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రతి పథకంతో పాటు, ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో కొత్తగా రేషన్ కార్డులు పొందినవారికి ప్రభుత్వ పథకాలను అందించడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు నేరుగా లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి వివరాలను నమోదు చేసుకొని అర్హత ఉన్న పథకాలను వారికి అందించే అవకాశం ఉంది.
30 లక్షల మందికి పైగా లబ్ధి
రాష్ట్రవ్యాప్తంగా దీనికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతో కొత్త రేషన్ కార్డులు తీసుకున్న 30 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా కొత్త రేషన్ కార్డు దారులకు ఇబ్బంది కలగకుండా వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం నిజంగా వారికి శుభవార్త.












Click it and Unblock the Notifications