ఆంధ్రా ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఎందుకిచ్చారు..? రేవంత్ ఫైర్..

గతకొంతకాలంగా సైలెంట్ అయిపోయిన టీ-టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి.. చాలారోజుల తర్వాత మునుపటి ఫైర్ ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. తెలంగాణ సర్కార్ వ్యవహార శైలిని తప్పుబట్టిన రేవంత్.. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవం సందర్భంగా టీ సర్కార్ అన్ని ప్రముఖ దినపత్రికల్లో యాడ్స్ ఇచ్చింది. దాదాపుగా అన్ని పత్రికల మొదటి పేజీలో ఈ యాడ్ ను ప్రచురించారు. ఇదే విషయాన్ని తప్పుబట్టిన రేవంత్.. ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తే అంతంత పెద్ద ఫోటోలతో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు.

revanth raised a controversy over trs publicity

మీరేమైనా అందాల పోటీలో ఐశ్వర్యారాయ్ తో పోటీ పడడానికి వెళ్తున్నారా?.. పెద్ద పెద్ద ఫోటోలతో మామా అల్లుళ్ల ప్రచారమేంటని ప్రశ్నించారు రేవంత్. ఇకపోతే ఈ ప్రకటనల కాంట్రాక్ట్ అంతా ఓ ఆంధ్రా ఏజెన్సీకి అప్పగించారని చెప్పిన రేవంత్.. ఆంధ్రా ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+