Revanth Reddy: కాంగ్రెస్‌లో ప్రక్షాళన మొదలుపెడుతారా.. మొదట చెక్ చెప్పేది ఆయనకేనా..?
విబేధాలు... గ్రూపు రాజకీయాలు... ఎవరికి వారు తామే సీఎం అభ్యర్థులమని భావించే నేతలు... ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. పార్టీలో భిన్నాభిప్రాయాలే తప్ప ఏకాభిప్రాయం అనే మాట అంతగా వినిపించదు. కాంగ్రెస్‌లో ఉన్న ప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెప్పుకోవచ్చు గాక... కానీ అంతిమంగా అది చేటు చేసిందా... మేలు చేసిందా అన్నదే కదా అసలు లెక్క. కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి ఈ లెక్కల్ని సరిచేస్తారా... ప్రక్షాళన ఎక్కడినుంచి మొదలుపెట్టబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో హుజురాబాద్ ఉపఎన్నిక ఉండటంతో... ఇక్కడినుంచే రేవంత్ మార్క్ కనిపించబోతుందన్న ప్రచారం జరుగుతోంది.
Recommended Video

రేవంత్ ముందు పెద్ద సవాల్...
రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించడమే ఆలస్యం... కోమటిరెడ్డి రూపంలో సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రేవంత్‌కు పీసీసీ పదవి దక్కడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు,రానున్న హుజురాబాద్ ఉపఎన్నికలో కనీసం డిపాజిట్ సాధించాలని సవాల్ విసిరారు.
అంటే,రేవంత్‌కు అంత సీన్ లేదని కోమటిరెడ్డి చెప్పకనే చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు తప్పు అని నిరూపించాలంటే... హుజురాబాద్ ఉపఎన్నికలో రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ ధీటైన పోటీ ఇవ్వగలగాలి. లేదంటే,తన మాటలే నిజమయ్యాయని ఉపఎన్నిక తర్వాత కోమటిరెడ్డి మళ్లీ కామెంట్ చేయకమానరు. కాబట్టి హుజురాబాద్ ఉపఎన్నిక రూపంలో రేవంత్ ముందు పెద్ద సవాలే ఉంది.

అదే నిజమైతే ఉత్తమ్ కోటరీకి చెక్?
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ తరుపున కౌశిక్ రెడ్డి రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నిన్నటి కాంగ్రెస్ సారథి,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి దగ్గరి బంధువు. రాబోయే ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ తనకే టికెట్ ఇస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు.
అయితే పార్టీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ జరుగుతోంది. కౌశిక్ రెడ్డి స్థానంలో కరీంనగర్ మాజీ ఎంపీ,తనకు అత్యంత సన్నిహితుడు పొన్నం ప్రభాకర్‌కు రేవంత్ అవకాశం ఇవ్వొచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఉత్తమ్ కోటరీకి ఇక్కడినుంచే చెక్ మొదలవుతుందన్న ప్రచారం జరుగుతోంది.

ఉత్తమ్‌పై విమర్శలు,ఆరోపణలు...
ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందని గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు బాహాటంగానే విమర్శలు చేశారు. టీఆర్ఎస్‌తో ఆయన కుమ్మక్కయ్యారన్న విమర్శలూ వచ్చాయి. హుజూర్ నగర్ ఉపఎన్నిక సమయంలో... ఉత్తమ్‌పై రేవంత్ రెడ్డి అప్పటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాకు నేరుగా ఫిర్యాదు చేశారు.
అభ్యర్థి ఎంపిక విషయంలో ఉత్తమ్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ... ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కుంతియాను కోరారు. అటు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీ టీమ్ అని చెప్పేందుకు ఉత్తమ్‌నే ఉదహరిస్తున్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిన కుంభకోణాన్ని బయటపెడుతామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉత్తమ్ కారులో భారీగా నగదు పట్టుబడితే అధికార పార్టీ ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. ఉత్తమ్‌తో సత్సంబంధాలు ఉండటం వల్లే టీఆర్ఎస్ వాటిని చూసీ చూడనట్లు వదిలేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

కౌశిక్ రెడ్డిని పక్కనపెడుతారా...?
ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ ఆరోపణల వ్యవహారంలో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరించారు. ఓవైపు ఈటల కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతున్న సమయంలోనే... కౌశిక్ రెడ్డి ఆయనపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. పైగా ఇటీవల కౌశిక్ రెడ్డి మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారన్న గుసగుసలు కూడా వినిపించాయి.
అయితే ఓ మిత్రుడి తండ్రి దశ దిన కర్మ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనేందుకు రాగా... యాధృచ్చికంగా అక్కడ కలిశామే తప్ప ఇందులో రాజకీయాలకు తావు లేదని కౌశిక్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉత్తమ్ బంధువు కౌశిక్ రెడ్డికి రేవంత్ టికెట్ ఇస్తారా... లేక మరొకరికి ఆయన అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ కౌశిక్ రెడ్డిని పక్కనపెడితే ఉత్తమ్ కోటరీకి రేవంత్ చెక్ పెట్టడం మొదలైనట్లే అన్న చర్చకు అవకాశం ఏర్పడుతుంది.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications