తగ్గేదే లే అంటున్న కాంగ్రెస్ క్యాడర్-కేసీఆర్‌కు సరైన మొగుడు వచ్చాడంటూ-రేవంత్ బాధ్యతల వేళ ఫుల్ జోష్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్న వేళ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. నిన్న,మొన్నటిదాకా డీలా పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ ప్రమాణస్వీకారాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాజకీయం నిన్నటి దాకా ఒక ఎత్తు... ఇప్పటినుంచి మరొక ఎత్తు అని సవాల్ విసురుతున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్ష పదవికే ఇంత హంగు ఆర్భాటాలా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ ఇప్పుడే సీఎం అయిపోయినట్లు కలలు కంటున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రస్తుతానికి కాంగ్రెస్ శ్రేణులు 'తగ్గేదే లే..' అన్న మూడ్‌లో ఉన్నారు.

భీమవరంలోనూ రేవంత్ ఫ్లెక్సీలు

భీమవరంలోనూ రేవంత్ ఫ్లెక్సీలు

రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వేళ తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అక్కడి రేవంత్ అభిమానులు ఫ్లెక్సీలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో బుధవారం(జులై 7) రేవంత్ అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేవంత్‌కు హార్థిక శుభాకాంక్షలు చెబుతూ రేవంత్ ఫ్యాన్స్‌ పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.

బంజారాహిల్స్‌లో ఫ్లెక్సీల తొలగింపు

బంజారాహిల్స్‌లో ఫ్లెక్సీల తొలగింపు

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నం.2లో రేవంత్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఆయన అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతులు లేవన్న కారణంతో జీహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించారు. దీంతో రేవంత్ అభిమానులు అధికారులపై ఫైర్ అయ్యారు. అధికార పార్టీ నేతల ఫ్లెక్సీల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించే అధికారులు ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేత ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అధికారులకు,రేవంత్ అభిమానులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

తగ్గేదే లే..

తగ్గేదే లే..

రేవంత్‌కు టీపీసీసీ చీఫ్ పదవి దక్కడంతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మారిపోనుందని ఆయన మద్దతుదారులు,అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్‌కు రేవంతే సరైన మొగుడు అని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటున్నారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ తిరిగి పునర్వైభవం సంతరించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్‌ను చూడబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్‌కు పగ్గాలు ఇవ్వడంతో యువతలో జోష్ పెరిగిందని చెబుతున్నారు.

Recommended Video

    Revanth expressed his allegiance to congress high command being elected PCC president.
     గాంధీభవన్‌లో రేవంత్ బాధ్యతలు

    గాంధీభవన్‌లో రేవంత్ బాధ్యతలు

    బుధవారం(జులై 7) మధ్యాహ్నం 1.30గంటలకు నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌లో రేవంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకుముందు,ఉదయం 10గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అక్కడినుంచి నాంపల్లి దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేశారు. ఆపై ర్యాలీగా గాంధీభవన్‌కు బయలుదేరారు. గాంధీ భవన్‌లో ప్రమాణస్వీకారం అనంతరం రేవంత్ కార్యకర్తలను,పార్టీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అందరినీ కలుపుకోవాలని... అందరివాడిని అనిపించుకోవాలని భావిస్తున్న రేవంత్... తన ప్రసంగం ద్వారా పార్టీ శ్రేణులకు ఆ సంకేతాలు పంపించే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+