ఎర్రవల్లి ఫాంహౌస్ కు సీఎం రేవంత్..? అక్కడే మాక్ అసెంబ్లీ .. ?
కృష్ణా జలాలపై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదంటే.. తారీఖు చెబితే మా మంత్రులంతా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వస్తారు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామని.. చర్చ పెడదామని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై ప్రజాప్రతినిధులకు ప్రజాభవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెటేషన్ కు హాజరైన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కృష్ణా జలాలపై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంత్రులు వద్దు అంటే... నేనే వస్తానని అన్నారు. వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా సభలో చర్చ చేద్దామంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై ప్రజాప్రతినిధులకు ప్రజాభవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెటేషన్ కు హాజరైన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
" తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లంతా ఇక్కడ ఉన్నారు.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ పదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. నీటిపారుదల శాఖకు ఆనాడు కేసీఆర్ కుటుంబంలోని వారే మంత్రులుగా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్లు వితండవాదం చేస్తున్నారు. నీటిపారుదల అంశంపై చర్చించేందుకు స్పీకర్ కు లేఖ రాయమని కేసీఆర్ ను కోరాను. అవసరమైతే నాలుగు రోజుల పాటు చర్చ పెడదామని అన్నాను. వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా సభలో చర్చ చేద్దామని చెప్పాను. బేసిన్లు, బేషజాలు లేవంటూ ఆంధ్రావాళ్లను నీళ్లు తీసుకుపొమ్మని కేసీఆర్ చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని రైతులకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్ కు ఎవరూ ఇవ్వలేదు" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"మీ కుటంబ సమస్యలు ఉంటే మీరు చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదంటే.. తారీఖు చెబితే మా మంత్రులంతా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వస్తారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. కేసీఆర్ కోరుకుంటే ఎర్రవల్లిలో జరిగే ప్రజా ప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తా. క్లబ్బులు, పబ్బులు అంటేనే ఇబ్బంది. నన్ను క్లబ్బులు, పబ్బులకు పిలవద్దు. ప్రజాభవన్ గడి కాదు, ఇక్కడ ధర్మగంట ఎవరైనా కొట్టవచ్చు" అని సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆనాడు వైఎస్ జగన్ ను పిలిచి సలహాలు ఇచ్చి.. జీవోలు వచ్చేలా సహకరించారు కేసీఆర్. జగన్, కేసీఆర్ మధ్య ఏముందనేది అనవసరం. జూరాల నుంచే నీరు తీసుకుందామని చిన్నారెడ్డి ఆరోజు సూచన చేశారు. చిన్నారెడ్డిని కేసీఆర్ అవమానించారు. కృష్ణాలో నీళ్లు తెలంగాణలోకి వచ్చిన వెంటనే ఒడిసిపట్టాల్సింది. రాయలసీమ నీటి దారి దోపిడీకి సహకరించింది కేసీఆరే. ఏపీ వాళ్ల మెప్పు కోసం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారు. ఇప్పుడు మౌనంగా ఉండకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications