తెలంగాణలో కాలు పెట్టను, చంద్రబాబు ఎక్కడికీ పోలేదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో టిడిపి అయిపోయిందని అంటున్నారని, చంద్రబాబు ఎపికి వెళ్లిపోయారు టిడీపి లేదని తెరాస మిత్రులు అంటున్నారని, ఇప్పుడు ఈ సభకు హాజరైనవారిని కెసిఆర్‌కు ఎలక్ట్రానిక్ మీడియాకు చూపించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిజాం కళాశాల మైదానంలో ఉన్నవారి కన్నా మూడొంతు ప్రజలు బయట ఉన్నారని, వారందరినీ ఎలక్ట్రానిక్ మీడియా చూపించాలని ఆయన అన్నారు.
బిజెపి, టిడిపి కూటమి జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార సభలో ఆయన మంగళవారంనాడు ప్రసంగించారు. హుస్సేన్ సాగర్ ఉప్పొంగి ఊరి మీదికి వస్తే ఎలా ఉంటుందో అలా నిజాం కళాశాల మైదానంలో ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు తెచ్చినవాటిని చూపించి ఐటి సంస్థలన్నీ తామే తెచ్చామని కెటిఆర్ చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.

వంద సీట్లు తెరాస గెలిస్తే, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, కెటిఆర్ కోరుకుంటే తెలంగాణ భూభాగంలో కాలు పెట్టబోనని, ఆయన అన్నారు. తెరాస ఎంపి కల్వకుంట్ల కవితపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఎక్కడా కనిపించడం లేదని ఆయన అన్నారు. కెటిఆర్, హరీష్ రావు, కవితలకు కావాల్సినవి ఇచ్చారు కాబట్టి కెసిఆర్ భోళాశంకరుడేనని ఆయన అన్నారు. ప్రజలను మాత్రం పేదవాళ్లుగా మార్చాడని ఆయన అన్నారు.
కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కెసిఆర్ గుప్పిగంతులు వేస్తున్నారని ఆయన అన్నారు. కెటిఆర్ చదువుకున్నది గుంటూరులో, పూణేలో, అమెరికాలో అని, చప్రాసీ నౌకరీకి కూడా కెటిఆర్ స్థానికుడు కాదని ఆయన అన్నారు. రాష్ట్రం నలుగురు చేతుల్లో నలిగిపోతోందని ఆయన అన్నారు. విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, తదితర కార్యక్రమాలు చేపట్టింది తామేనని ఆయన అన్నారు. హైదరాబాద్ ధనిక రాష్ట్రమైందంటే 60 వేల కోట్ల ఆదాయం వచ్చేలా రోజుకు 18 గంటలు శ్రమించారని, చంద్రబాబు ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేశారని ఆయన అన్నారు. 11 నెలల్లో తాము హైటెక్ సిటీ కడితే 18 నెలల్లో దాని ముందు మోరీ కట్టలేదని ఆయన అన్నారు.
ప్రతిబస్తీకి, ప్రతి మూలకూ వస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు ఎక్కడికీ పోలేదని, ఎవరి మీద ఈగవాలినా చంద్రబాబు ఊరుకోరని ఆయన అన్నారు. కెసిఆర్ తన తాతను తెచ్చుకుంటే తాము ప్రధాని నరేంద్ర మోడీని తెస్తామని ఆయన చెప్పారు. కెసిఆర్ వస్తే చంద్రబాబు వస్తారని, కెటిఆర్ వస్తే తాను వస్తానని ఆయన అన్నారు. హైదరాబాదును విశ్వనగరంగా మార్చే బాధ్యత తమదని ఆయన అన్నారు.
తమ నేత చంద్రబాబు తెచ్చినవాటిని చూపించి కెటిఆర్ ఐటి సంస్థలన్నీ తామే తెచ్చామని చెబుకుంటున్నారని ఆయన అన్నారు. ఎల్బీ నగర్ సమావేశానికి కెటిఆర్ వెళ్తే ఇప్పుడు నిజాం కళాశాలలో బఠానీలు అమ్ముకునేంత మంది కూడా రాలేదని ఆయన అన్నారు. ఇషాంత్ రెడ్డి, శ్రీకాంతాచారి వంటి వారి బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని, కెసిఆర్ ఒక్కడి వల్ల రాలేదని ఆయన అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ నుంచి ఎన్టీఆర్ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను కల్పించారని ఆయన అన్నారు.
అక్బరుద్దీన్ ఓవైసీ ఆదేశాలిస్తే హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం జరగకూడదని కెసిఆర్ చెప్పారని, తాము పోరాడి హుస్సేన్ సాగర్‌లోనే వినాయక నిమజ్జం జరిగేలా చూశామని ఆయన చెప్పారు. కెసిఆర్ కుటుంబం తెలంగాణను బందీ చేసిందని ఆయన అన్నారు.
-
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఏపీకి ఈ బెనిఫిట్.. ఫోకస్ చెయ్యమన్న సీఎం చంద్రబాబు -
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23నుండి మీ సమయం, డబ్బు రెండూ ఆదా! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications