Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలి.. రేవంత్ రెడ్డి..

మేడిగడ్డ బ్యారేజ్(Medigadda barrage) లో పిల్లర్లు కుంగడం.. అన్నారం బ్యారేజ్ వద్ద బుంగలు ఏర్పడడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కాళేశ్వరం కట్టినప్పుడు అన్న తానేనని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleswaram project) ను స్వయంగా తానే డిజైన్ చేసినట్టు కేసీఆర్ చెప్పారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటి(TPCC) రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో పెద్ద పెద్ద ప్రసంగాలు కూడా చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని సీఎం గొప్పలు చెప్పుకున్నారని.. ఇప్పుడు మాత్రం నోరు విప్పడం లేదన్నారు. కాళేశ్వరంలో ఇంత ఉపద్రవం జరిగినా కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. డిజైన్ల లోపాలు, నాసిరకం పనులు జరిగాయని ప్రభుత్వానికి తెలుసని రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి కేంద్రం ఎందుకు విచారించదన్నారు. దీనిపై CBI తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర ఎందుకు మౌనంగా ఉంటోందని బీజేపీ చెప్పాలన్నారు.

Revanth Reddy demanded a CBI inquiry regarding the Kaleswaram project

పిల్లర్లు కుంగగానే బీఆర్ఎస్ ప్రభుత్వం టెక్నికల్ సమస్య అని తప్పించుకుంటోందన్నారు. కాళేశ్వరంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిర్మాణాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. బాధ్యతలపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయట పెట్టిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 6 నెలలో కాంట్రాక్ట్ సంస్థ వ్యారెంటీ పూర్తవుతుందని.. కేంద్ర కమిటీ అడిగిన అంశాల్లో తొమ్మిదింటికి వివరాలు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పారు.

కేసీఆర్ పాపం పండే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన ఆలోచనలు మారి.. ఆశలు పెరిగాయని రేవంత్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయని రేవంతే ఆరోపించారు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+