ఓటుకు నోటు: స్టీఫెన్‌సన్ ఏం చెప్పారు?, తనకు తెలియాలంటూ రేవంత్ పిటిషన్
హైదరాబాద్: టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటుకు నోటు వ్వవహారంలో ఇచ్చిన వాంగ్మూలం ఏపీసీ కోర్టుకు శుక్రవారం మధ్యాహ్నాం చేరింది. దీంతో, ఆయన ఇచ్చిన వాంగ్మూలం సర్టిఫైడ్ కాపీ కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
తన పిటిషన్‌లో స్టీఫెన్‌సన్ ఏం వాంగ్మూలం ఇచ్చాడో తెలుసుకోవాలని అవసరం తనకుందని తెలిపాడు. దీనికి సంబంధించిన పిటిషన్‌ను శుక్రవారం ఆయన తరుపు న్యాయవాదులు ఏబీసీ ప్రత్యేక కోర్టుకు అందించారు.

టీఆర్ఎస్ ఎమ్మేల్యే స్టీఫెన్‌సన్ న్యాయమూర్తి ఎదుట చెప్పిన వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాతే ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఓ నిర్ణయానికి వస్తామని రేవంత్ తరుపు న్యాయవాదులు వెల్లడించారు.
టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్‌సన్ తన వాంగ్మూలాన్ని బుధవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్టీపెన్ సన్ వద్ద వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
ఓటుకు నోటు కేసులో కీలకంగా మారిన స్టీఫెన్‌సన్‌కు తెలంగాణ పోలీసులు భారీ భద్రతను కల్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications