కేసీఆర్.. నీకు తుపాకీ పెడితే సీఎం కూర్చి ఇస్తావా?: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. శనివారం గాంధీ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రైతుల జీవితంపై మరణ శాసనం రాశారని మండిపడ్డారు.

పెట్రో ధరల పెంపులో.. కేంద్ర, రాష్ట్ర పన్నులే ఎక్కువ: రేవంత్
కోడికి ధర తక్కువ.. మసాలాకే ధర ఎక్కువ అయ్యిందంటూ పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రస్తావించారు. లీటర్ పెట్రోల్ నిజానికి 50 రూపాయలకే వస్తుంది. కానీ, కేసీఆర్ 35 రూపాయలు, మోడీ 30 రూపాయలు పన్ను వేసి దాన్ని ఇంత దాకా తీసుకువస్తున్నారు. డీజిల్ మీద 50 రూపాయలు పన్ను వేస్తున్నారు. కేంద్రం పన్నులు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్.. కేంద్రం మీద విమర్శ చేస్తున్నప్పుడు నువ్వెందుకు పన్నులు తగ్గించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. 25 రాష్ట్రాల్లో పన్నులు రాయితీ ఇస్తున్నప్పుడు మీరెందుకు తగ్గించరు అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో రాయితీలు ఇస్తున్నా కేసీఆర్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పాకిస్థాన్‌లో 70 రూపాయలే పెట్రోల్ అమ్ముతున్నారని తెలిపారు. పేదలను దోపిడీ చేయడంలో కేసీఆర్, నరేంద్ర మోడీ ఒక్కరే అని రేవంత్ విమర్శించారు.

ప్రజల ఇంటి కరెంట్ కేసీఆర్ పెంచిండు: రేవంత్
రాజకీయాలకు వచ్చే సరికి నేను తెలంగాణ... మోడీ గుజరాత్ అంటారు కేసీఆర్. పేదలను దోచుకునే విధానం లో అవిభక్త కవలలు వీరిద్దరూ అని ఎద్దేవా చేశారు రేవంత్. విద్యుత్ ఛార్జీలు పెంపకం వెనక ప్రభుత్వం వైఫల్యం వుందన్నారు. విద్యుత్ సంస్థలకు మొండి బకాయిదారు ప్రభుత్వం. ప్రగతి భవన్ కరెంట్ బిల్లు కట్టడు. ప్రభుత్వ ఆఫీసుల బిల్లులు చెల్లించరు, విద్యుత్ సంస్థలు కుప్ప కూలడానికి ప్రభుత్వమే కారణం. వ్యవసాయంకి కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు... ఇంటి కరెంట్ పెంచుతున్నారు. ప్రజలు అది గమనించాలన్నారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్.. నీకు తుపాకీ పెడ్తే.. సీఎం సీటు ఇస్తావా: రేవంత్ రెడ్డి
రైతులను ఎనిమిదేళ్ళు వడ్లు పండించే దానికి అలవాటు చేసి... ఇప్పుడు వరి వద్దు అంటున్నారు. వరి కొనను అంటే ఎట్లా? తాగురి.. ఊగురి అనే స్కీమ్ తెచ్చారు కేసీఆర్. 2021లో ఎఫ్‌సీఐకి తెలంగాణ సివిల్ సప్లై ఎండీ లేఖ రాశారు. ఫార్ బైల్డ్ రైస్ అందించమని చెప్పాడు. ఇప్పుడేమో... కేంద్రం కొనాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రైతుల హక్కులు కేంద్రంకి ధారాదత్తం చేశారు కేసీఆర్. లొంగిపోయి ఒప్పందం చేసుకున్నావు కాబట్టి పీయూష్ గోయెల్ గొంతు పెంచారని కేసీఆర్ పై మండిపడ్డారు. నీమీద కత్తి పెడితే రైతుల హక్కులు రాసిస్తావా..? నీకు తుపాకీ పెడితే ఫామ్ హౌస్ రాసి ఇస్తావా..? సీఎం కుర్చీ ఇస్తావా..? అంటూ కేసీఆర్‌ను నిలదీశారు. కేసీఆర్ లేఖ రాయక పోతే పీయూష్ గోయెల్‌ని చొక్కా పట్టుకుని లాగేవాళ్ళం. రాష్ట్ర ప్రభుత్వంని రాళ్లతో కొట్టి చంపాలి. కేంద్రం తో ఒప్పందం కుదుర్చుకున్నది కేసీఆర్. ఆయనకు మేము మద్దతు ఇవ్వాలి అంట. తెలంగాణ సర్కార్‌ని గన్ పార్క్ దగ్గర రాళ్లతో కొట్టాలి. రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications