రేవంత్ వెనుకడుగేయడం చరిత్రలో లేదు: కేసీఆర్, తుమ్మలపై నిప్పులు

Subscribe to Oneindia Telugu

ఖమ్మం: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎంపీ కవితలు నిమిషాలపాటు శ్రమించి, ఐస్ క్రీంలు, చీరలు అమ్మి లక్షలు సంపాదించినట్లు చెప్పుకుంటున్నారని.. రైతులకు రూ. 10వేల గిట్టుబాటు ధర కల్పించడం వారికి ఎందుకు సాధ్యం కావడం లేదో తెలియడం లేదన్నారు.

రాస్కోరా సాంబా అన్నట్లుగా..

రాస్కోరా సాంబా అన్నట్లుగా..

మిర్చి రైతులు ఆందోళన చేస్తే నమస్తే తెలంగాణ పత్రికలో ఎక్కడా కూడా ఇవ్వలేదని అన్నారు. అంతేగాక, ప్రతిపక్షాలకు పిచ్చిపట్టిందని రాసుకొచ్చారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు కాదు, కేసీఆర్ కే పదవి పిచ్చి పట్టుకుందని రేవంత్ ఆరోపించారు. వరంగల్ సభ కోసం ఇక్కడి హమాలీలు, కూలీలు, రైతులను తీసుకెళ్లారని, ఆ తర్వాత రోజున ఖమ్మం మార్కెట్లోకి వచ్చిన లక్షా50వేల టన్నుల మిర్చి కొనుగోళ్లు జరగలేదని అన్నారు.

తప్పేం లేదు, తిరగబడితే..

తప్పేం లేదు, తిరగబడితే..

గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేపట్టారని అన్నారు. అధికారులు, వ్యాపారులు మోసం చేస్తున్నారనే రైతులు తిరగబడ్డారని రేవంత్ చెప్పారు. ఇందులో రైతుల తప్పేం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం కీలక పాత్ర అని, 1969ఉద్యమం పాల్వంచలోనే ప్రారంభమైందని రేవంత్ గుర్తు చేశారు. రైతులను కేసీఆర్ గడ్డిపోసలుగా చూస్తున్నారని, వారే తిరగబడితే పరాభవం తప్పదని హెచ్చరించారు.

రేవంత్ వెనుకడు చరిత్రలోనే లేదు

రేవంత్ వెనుకడు చరిత్రలోనే లేదు

రేవంత్ రెడ్డికి ఎప్పుడూ, ఎక్కడా నిరసనలు ఎదురుకాలేదని, రేవంత్ రెడ్డి వెనుదిరిగిన చరిత్రే లేదని అన్నారు. తన కుటుంబంలో విషాదం జరిగితే తాను ఖమ్మం నుంచి వెనుదిరిగానని తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు తన చెంచాలతో తనను అడ్డుకోవాలని చూశారని అన్నారు. తలకుమాసిన తుమ్మల నాగేశ్వరరావుకు భయపడేది లేదని అన్నారు. ఎన్టీఆర్ వారసులమని, టీడీపీకి వెన్నుపోటు పొడిచిన తుమ్మలకు బుద్ధి చెబుతామని అన్నారు.

తుమ్మల పాపాలు రైతుల కాళ్లు పట్టుకున్నా పోవు..

తుమ్మల పాపాలు రైతుల కాళ్లు పట్టుకున్నా పోవు..

ఖమ్మం మార్కెట్లో ఆందోళన చేసింది గుండాలు కాకుంటే తాను రైతుల కాళ్లు పట్టుకుంటానని తుమ్మల అన్నారని.. ఆందోళన చేసింది గుండాలైతే మరోసారి జైలుకు పంపాలని, రైతులైతే కలెక్టరేట్ సాక్షిగా రైతుల కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకోవాలని తుమ్మలకు సవాల్ విసిరారు. అయినా తుమ్మల పాపాలు పోవని అన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రైతులు గళం విప్పారని అన్నారు.

 సినిమాలకేనా..?

సినిమాలకేనా..?

కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామన్న కేసీఆర్.. ఇప్పుడు రైతులు పండించిన గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని మండిపడ్డారు. పత్తి వద్దని, మిర్చి పండించమని చెప్పి.. ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కల్పించక వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని రైతుల ఏ పంటకూ ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదని రేవంత్ ఆరోపించారు. రుద్రమదేవి, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలకు పన్ను రాయితీలు, బాహుబలి లాంటి సినిమాలకు రేట్లు పెంచుకోమంటూ కేసీఆర్ ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని రేవంత్ ఆరోపించారు. ఇదంతా తన కొడుకు కోసం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతులు చచ్చిపోతున్నా.. వారి పంటకు గిట్టుబాటు ధర మాత్రం ఈ ప్రభుత్వం కల్పించడం లేదని మండిపడ్డారు.

వ్యతిరేకంగా రాస్తే అంతే..

వ్యతిరేకంగా రాస్తే అంతే..

కేసీఆర్ తెలంగాణను ముంచడానికే తన తెలివిని ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ పత్రికలోనైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తే వారిని బెదిరించడం గానీ, రాత్రి పూట వారిని కలవడం గానీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఖమ్మం జిల్లా రైతులు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam leader and MLA Revanth Reddy on Saturday lashed out at Telangana CM K Chandrasekhar Rao.
Please Wait while comments are loading...