వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయవిపత్తుగా ప్రకటించి తక్షణప్యాకేజ్ ఇవ్వండి: తెలంగాణా వరదలపై ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తాయి. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుండి వస్తున్న వరదతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. గోదావరికి వరద పోటెత్తడంతో అనేక గ్రామాలు నీట మునిగి, ప్రజలు నిరాశ్రయులయ్యారు. అపార పంట నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ లో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీకి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

తక్షణ ఉపశమన ప్యాకేజీగా 2 వేల కోట్ల రూపాయలను ఇవ్వండి

తెలంగాణ రాష్ట్రానికి తక్షణ ఉపశమన ప్యాకేజీగా 2 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించాలని లేఖలో కోరారు. రోడ్లను మరమ్మతు చేయడానికి పునర్నిర్మించడానికి, నిత్యావసర వస్తువుల సరఫరాను పునరుద్ధరించటానికి కేంద్రం సహాయం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాదు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణలో 11లక్షల ఎకరాల్లో అపార పంట నష్టం


రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వరద ముంపునకు గురయ్యాయని లేఖలో పేర్కొన్న రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వరద పరిస్థితిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో కుండ పోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారితే, గ్రామాలన్నీ చెరువులను తలపిస్తూ ఉంటే, ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తుంటే కెసిఆర్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అయ్యా కొడుకులు మళ్ళీ అబద్దాలే చెప్తున్నారు


వాగులు, వంకలు పొంగి పొర్లుతూ, అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే అబద్ధాల్లో పుట్టి అబద్ధాల్లో పెరిగి అబద్ధాన్ని నమ్ముకొని బతుకుతున్న అయ్యా కొడుకులు మాత్రం మళ్లీ అలాంటి అబద్దాలు చెబుతూ ప్రజలను, రైతులను మభ్యపెట్టే కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. వందేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో కుంభవృష్టి వర్షం కురిసి ఉత్తర తెలంగాణ జిల్లాలో పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వరి, పప్పు ధాన్యాల పంటలు పూర్తిగా నీట మునిగి సర్వనాశనమై పోతే ఒక ఎకరం కూడా పంట నష్టం జరగలేదని ట్విట్టర్ పిట్ట కూతలు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కమీషన్ల కోసమే ప్రాజెక్ట్ లు కానీ, నిర్వహణ నిధులు ఇచ్చేది లేదు

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్టు సమాచారం లేదని తెలిసి తెలియక మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించిన అవివేకమని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం ఒక లక్ష కోట్లతో ప్రాజెక్టులు కడుతున్నారని, కానీ వాటి నిర్వహణకు నయాపైసా విడుదల చేయడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు, కమిషన్ ఇచ్చేవారికి ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి కానీ ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు ఇవ్వడానికి మాత్రం ప్రగతిభవన్ గేట్లు తెరుచుకోవని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కెసిఆర్ కు ఉన్న ధన దాహం, అధికార దాహం ప్రాజెక్టుల నిర్వహణ పై కేసీఆర్ పెడుతున్న శ్రద్ధతో అర్థమవుతుంది అంటూ ఎద్దేవా చేశారు.

రైతులకు ఎకరాకు రూ.15,000 నష్టపరిహారం, విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి

రైతులకు ఎకరాకు రూ.15,000 నష్టపరిహారం, విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి

భారీ వర్షాలకు 857 గ్రామాల్లో వరద నీరు చేరింది అని పేర్కొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గ్రామాలలో నెలకొన్న పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని వెంటనే పంపించాలని ప్రధాని మోడీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలన్నారు. రైతులకు ఎకరాకు రూ.15,000 నష్టపరిహారం ఇవ్వాలని, పంటలను తిరిగి సాగు చేసేందుకు విత్తనాలు & ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

English summary
Revanth Reddy has written a letter to Prime Minister Modi on Telangana floods asking him to declare Telangana floods as a national disaster and give an immediate relief package of 2 thousand crore rupees..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X