• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు కేంద్రంగా కొత్త పొత్తులు - రేవంత్ ప్రతిపాదన : వర్కవుట్ అయ్యేనా..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కొత్త పొత్తుల దిశగా అడుగులు పడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నుంచే ఈ బంధాలను మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే పార్టీల్లో టీఆర్ఎస్ మినహా..ఇతర పార్టీలతో కలిసి పొత్తు దిశగా టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రతిపాదనలు చేస్తున్నారు. మునుగోడులో కొత్త పొత్తుల ఫలితం చూసిన తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా కొనసాగించేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనుగోడులో విజయం కాంగ్రెస్ పార్టీకి..వ్యక్తిగతంగా రేవంత్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

కమ్యూనిస్టు పార్టీలతో వెళ్దామంటూ

కమ్యూనిస్టు పార్టీలతో వెళ్దామంటూ

తాజాగా మునుగోడు ఎన్నికల పైన రేవంత్ రెడ్డి ఒక వీడియో విడుదల చేసారు. అందులో మనతో పాటు కమ్యూనిస్టులను కలుపుకుని పోదాం అంటూ ఒక ప్రతిపాదన చేసారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారితీస్తోందంటూ చెప్పుకోచ్చారు.

నిత్యావసరాల ధరలు పెరిగాయని..దీనికి కేంద్రంలోని బీజేపీ కారణమని ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు..ఏడాది కి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు...ఏమైందంటూ నిలదీసారు. మునుగోడు ఉప ఎన్నిక కు బీజేపీ 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయని రేవంత్ చెప్పుకొచ్చారు.

భవిష్యత్ పొత్తులు ఇప్పటి నుంచే

భవిష్యత్ పొత్తులు ఇప్పటి నుంచే

మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్,ఇంటికో ఉద్యోగం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. వారికి ఓటు అడిగే హక్కు లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. ప్రజల పక్షాన ఈ రెండు పార్టీల ను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కి ఉందని రేవంత్ చెప్పారు.

కాంగ్రెస్ పక్షాన పేదలు ఉన్నారన్నారు. సమస్యల పై చర్చ జరగాలి వ్యక్తిగత విమర్శలు కాదని రేవంత్ వివరించారు. పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ,ట్రిపుల్ ఐటీ,జాతీయ హోదా సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో పై మనం పోరాటం చేయాలని రేవంత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Recommended Video

అధ్యకుడి క్షమాపణకి శాంతించని కోమటిరెడ్డి *Telangana | Telugu Oneindia
రేవంత్ తో కలిసి వచ్చేదెవరు

రేవంత్ తో కలిసి వచ్చేదెవరు

బీజేపీ వైఫల్యాలు ఎండగట్టాలన్నారు. మనతో పాటు కమ్మునిస్ట్ లు, కోదండరాం తో కలుపుకుని పోరాడదామంటూ ప్రతిపాదించారు. సమన్వయం చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పోరాడుదామని చెప్పుకొచ్చారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని..ఎవరికైనా మద్దతిస్తామని ఇప్పటికే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు స్పష్టం చేసాయి. అయితే, మునుగోడులో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం తమకు కలిసి వస్తుందని రేవంత్ అంచనా వేస్తున్నారు. అయితే, కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో కలిసి వెళ్తాయా..లేక, టీఆర్ఎస్ కు మద్దతిస్తాయా అనేది చూడాలి.

English summary
TPCC Chief Revanth Reddy new strategies for Munuodu by poll and for up coming assembly Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X