వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించటం వెనుక రహస్యమేమిటి? అమిత్ షాకు రేవంత్ రెడ్డి ప్రశ్నలవర్షం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అమిత్ షా సభ నేపథ్యంలో అమిత్ షా సభను టార్గెట్ చేస్తూ టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన అమిత్ షా కు 9 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.

అమిత్ షా కు కేటీఆర్ బహిరంగలేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్!!అమిత్ షా కు కేటీఆర్ బహిరంగలేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్!!

అమిత్ షా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి

అమిత్ షా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి


అమిత్ షా గారూ... 'ఛీ'ఆర్ఎస్ తో సావాసం చేస్తూ తెలంగాణ ప్రజలకు ఇద్దరూ కలిసి చేసిన మోసంతో పాటు... తెలంగాణ ఆత్మగౌరవం పై మోదీ దాడి, రైతుకు అన్యాయం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు... వీటిపై నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ ప్రశ్నాస్త్రాలను సంధించారు. మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటదు అన్న సామెత కేంద్రంలోని మీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుందని పేర్కొన్న రేవంత్ రెడ్డి 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మీ హామీ ఒట్టి బూటకమని వ్యాఖ్యానించారు. మీ పాలనలో రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు ఉందని పేర్కొన్నారు.

 సెంటిమెంట్ డైలాగులు కొట్టి వెళ్ళిపోతారా ?

సెంటిమెంట్ డైలాగులు కొట్టి వెళ్ళిపోతారా ?


అంతేకాదు బ్యాంకులకు వేల కోట్లను ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా పోతుంటే రైతు రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న మీ పాలనలో మార్పు అన్నది జీరో అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ లు ఎనిమిదేళ్లుగా ఒకదానికొకటి అంటకాగి రాష్ట్రానికి హక్కుగా రావలసిన పథకాలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని, తెలంగాణ రాష్ట్రానికి మీరు వచ్చిన ప్రతిసారి సెంటిమెంట్ డైలాగులు కొట్టి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎటువంటి హామీ ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

టిఆర్ఎస్ తో లడాయి అంటూ తొడలు కొడుతున్నారు.. ఇదేనా మీ లడాయి

టిఆర్ఎస్ తో లడాయి అంటూ తొడలు కొడుతున్నారు.. ఇదేనా మీ లడాయి


కెసిఆర్ కుటుంబ అవినీతితో ఇప్పటికే వేల కోట్ల తెలంగాణ ప్రజల సంపద దోపిడీకి గురి అయితే మీరు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. బొగ్గు స్కాం నుండి భూముల స్కాం వరకు ఫిర్యాదు ఇచ్చినా ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. ఇటీవల మీ పార్టీ మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తారు అని ఇక మీ పార్టీ రాష్ట్ర నాయకులు టిఆర్ఎస్ తో లడాయి అంటూ తొడలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేస్తున్న మీ రెండుపార్టీల చీకటి సంబంధం తెలంగాణ ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు .

 కెసిఆర్ కుటుంబ అవినీతిపై ఎనిమిదేళ్లుగా ఎందుకు ఉపేక్షిస్తున్నారో రహస్యం చెప్తారా?

కెసిఆర్ కుటుంబ అవినీతిపై ఎనిమిదేళ్లుగా ఎందుకు ఉపేక్షిస్తున్నారో రహస్యం చెప్తారా?


ఇక తాము సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి కెసిఆర్ కుటుంబ అవినీతిపై ఎనిమిదేళ్లుగా ఎందుకు ఉపేక్షిస్తున్నారో రహస్యం చెబుతారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడిన డ్రామా లో ఎంతో మంది రైతులు వడ్ల కుప్పల మీద ప్రాణాలు కోల్పోయారని వారి మరణాలకు బాధ్యులు మీ ఈ రెండు పార్టీలు కాదా అంటూ ప్రశ్నించారు. గత పార్లమెంటు సమావేశాలలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు తెలంగాణా కు వస్తున్న సందర్భంగా మీరు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .

పసుపు బోర్డు ఏది? విభజన హామేలేవీ?

పసుపు బోర్డు ఏది? విభజన హామేలేవీ?


పసుపు బోర్డు తీసుకొస్తానని గెలిచిన ఎంపీ ఇంతవరకూ పసుపు బోర్డు తీసుకురాలేదని, దీనికి మీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీతో పాటు విభజన చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. అయోధ్య నుండి రామేశ్వరం వరకు రాముడు పుణ్యక్షేత్రాలను దర్శించడానికి రామాయణ యాత్ర ఎక్స్ప్రెస్ పేరుతో రైలు ప్రవేశపెట్టారు. అందులో భద్రాద్రి రాముడికి ఎందుకు స్థానం కల్పించలేదు అంటూ ప్రశ్నించారు.

కెసీఆర్ కుటుంబ అవినీతిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోరా?

కెసీఆర్ కుటుంబ అవినీతిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోరా?


ఒరిస్సాలోని నైని కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా కెసిఆర్ కుటుంబ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోయాయని, పన్నులు , సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి అంటూ ప్రశ్నించారు. మోసానికి కవలపిల్లలు లాంటి బీజేపీ టీఆర్ఎస్ ఎత్తులు గ్రహించని అమాయకులా తెలంగాణ ప్రజలు అంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో మీ కుతంత్రం పనిచేయదు అంటూ అమిత్ షా కు తేల్చిచెప్పారు.

English summary
Revanth Reddy wrote an open letter to Amit Shah, in the wake of the Amit Shah meeting. What is the secret behind ignoring KCR family corruption? Revanth Reddy asked 9 questions to Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X