తెలంగాణ సీఎంవోలో మహారాష్ట్ర వ్యక్తికి ఉద్యోగం, లక్షన్నర జీతం: రేవంత్ సంచలనం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ విస్తరణ కోసం ప్రజాధనం వినియోగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే.. ప్రజాధనంతో పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు అక్కడి మనుషులను తెచ్చుకుని ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు.

మహారాష్ట్ర నుంచి పార్టీలో చేరిన శరత్ మర్కట్ అనే యువకుడికి సీఎంవోలో రూ. లక్షన్నర వేతనంతో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని రేవంత్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచారన్నారు. ప్రజల సొమ్ముతో ఏడాదికి రూ. 18 లక్షల వేతనం ఇస్తున్నారని మండిపడ్డారు.

revanthreddy

'సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శరద్ మర్కడ్ బీఆర్ఎస్‌లో చేరారని పత్రికల్లో వచ్చింది. శరద్ మర్కడ్‌కు సీఎంవోలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. పార్టీలో చేరిన 20 రోజులకే రూ. లక్షన్నర వేతనంతో నియమించారు. ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే ఇలాంటి నియామకాలా? అని రేవంత్ నిలదీశారు. పక్క రాష్ట్రం వారిని తీసుకొచ్చి అడ్డగోలుగా ఉద్యోగాలిస్తారా? బీఆర్ఎస్ కార్యక్రమాల కోసం ప్రజాధనం వినియోగిస్తున్నారని మండిపడ్డారు.

మహారాష్ట్రకు చెందిన వారు బీఆర్ఎస్‌లో చేరుతున్నారనేది ఓ నాటకమని విమర్శించారు. కిరాయి మనుషులను రప్పించి రోజుకో వేషం వేయించి పార్టీలో చేర్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి కర్ణాటకలో బీజేపీని ఓడగొట్టాలని చెప్పాలన్నారు. మరోవైపు, టీఎస్‌పీఎస్‌సీ పేపర్లను మార్కెట్లో అమ్ముకున్నారని రేవంత్ ఆరోపించారు.

తొమ్మిదేళ్లలో సర్కార్ అన్నింట్లో విఫలం అయ్యిందన్నారు. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతులు నష్టపోతే కనీసం ఆదుకోవడం లేదన్నారు. కేసీఆర్ రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టారని.. పండించిన పంట,తడిసి ధాన్యం కొనట్లేదని విమర్శించారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి విద్యార్థి, నిరుద్యోగులు మద్దతు పలకాలని రేవంత్ కోరారు. మే 8వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభకు అందరూ తరలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+