కారు టీఆర్ఎస్‌దే, కానీ స్టీరింగ్ వారి చేతుల్లో..: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కారు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)దే అయినా స్టీరింగ్ మాత్రం మజ్లీస్ చేతిలో ఉందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీనే ఓ సందర్భంలో చెప్పారని ఆయన అన్నారు.
గ్రేటర్‌లో మిషన్-100 టార్గెట్‌గా పనిచేస్తున్నామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. టీడీపీ-బీజేపీ కూటమికి 80-85 సీట్లు వస్తాయని తమ సర్వేలు చెబుతున్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ, టీఆర్‌ఎస్-ఎంఐఎం జట్ల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. నిబద్ధత కలిగిన వారికే గ్రేటర్‌లో టికెట్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్బన్‌లో డబుల్ బెడ్‌రూం పథకాన్ని కేంద్రమే అమలు చేస్తోందని రేవంత్ చెప్పారు. గ్రేటర్ పరిధిలో నాలుగు లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టించగలిగే సత్తా తమ కూటమికే ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు.
పార్టీ ఫిరాయింపులు, చెత్త సవరణలతో గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలని టీఆర్‌ఎస్ నేతలు అనుకుంటున్నారని, అలాంటి నీచ విధానాలతో విజయం సాధించలేరని ఆయన చెప్పారు. గ్రేటర్ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ రూ. 300 కోట్లు ఖర్చు చేయబోతోందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications