Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒవైసీ శర్వాణీ వెనుక పైజామా ఉందనుకున్నా.. ఖాకీ నిక్కరుంది: రేవంత్ ఫైర్

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీ శర్వాణీ లోపల పైజామా ఉందని అనుకున్నా.. కానీ, నిక్కరు ఉందని అర్థమైందంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం హక్కుల కోసం కొట్లాడాలని అసదుద్దీన్ తండ్రి ఆయన్ని బారిష్టర్ చదివించాడని చెప్పారు రేవంత్.

ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి అసదుద్దీన్ మద్దతుగా ఉంటున్నాడని రేవంత్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రాజా సింగ్‌పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, మోడీ లాంటి దొంగలను కాపాడటానికి ఒవైసీ అబద్ధాలు చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ కేసులు వాదిస్తున్న లాయర్ ఎవరని ప్రశ్నించారు.

 revanth reddy slams asaduddin owaisi.

'నేను హిందువుని. నేను భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ్తా. దర్గాకి రమ్మన్నా వస్తా. భాగ్యలక్ష్మి టెంపుల్‌కి రమ్మన్నా వస్తా' అని రేవంత్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మోడీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో ఒవైసీ పార్టీ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఒవైసీ సిద్ధమా? అని ప్రశ్నించారు. మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి ఒవైసీ సిద్ధమా? అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం మసీదుకు తాను వస్తానని.. ఖురాన్ పట్టుకుని ప్రమాణం చేయడానికి ఒవైసీ సిద్ధమా? అని సవాల్ విసిరారు.

మరోవైపు, బీఆర్ఎస్ నేతలపైనా రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు.

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో ఎన్నోసార్లు దాడులు చేశారని తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి వరుస కుట్రలు జరుగుతున్నాయని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. ఏపీలో కోడికత్తి ఘటన, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ కాలికి గాయం ఘటనలు ఇందుకు ఉదాహరణలు అని రేవంత్ చెప్పారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. సంచలనం కోసమే కొత్త ప్రబాకర్ రెడ్డిపై దాడి చేశారని పోలీసులు చెప్పారన్నారు.

దాడి చేసిన నిందితుడిని ఇప్పటి వరకు మీడియాకు చూపలేదన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలన్నారు. ఇప్పటి వరకు నిందితుడు రాజు.. రిమాండ్ రిపోర్టు కూడా బయటపెట్టలేదని రేవంత్ తెలిపారు. నిందితుడి కాల్ రికార్డ్ బయటపెట్టాలన్నారు. మరో మూడు కుట్రలు జరుగుతాయని ఇవాళ కేటీఆర్ స్పష్టం చెప్పారని రేవంత్ తెలిపారు. ఫాక్స్‌కాన్‌ను బెంగళూరు తరలిస్తున్నట్లు.. డీకే శివకుమార్ పేరిట తప్పుడు లేఖ ప్రచారం చేశారని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను హరీశ్ రవు ఎందుకు సమన్వయం చేశారని ప్రశ్నించారు రేవంత్. కర్ణాటక నుంచి కిరాయికి మనుషులను రప్పించి తెలంగాణలో ప్రదర్శనలు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటోందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు.

డీకే శివకుమార్‌ పేరిట తప్పుడు లేఖ ప్రచారం చేశారని, ఫాక్స్‌కాన్‌ను బెంగళూరు తరలిస్తున్నట్లు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అన్న రేవంత్.. ప్రశాంత్‌కిషోర్​ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఏపీలో కోడికత్తి ఘటన, బంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం ఘటన ఇందుకు ఉదాహరణలుగా రేవంత్ పేర్కొన్నారు.

'హరీష్ రావుకు... ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డ యువకుడి ఫోన్ సంభాషణ ఏమైనా ఉందా? దాడులు జరుగుతాయంటున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి' అని రేవంత్ అన్నారు. కుమారస్వామి ప్రెస్ మీట్ గురించి తెలంగాణలో టీవీ ఛానళ్లు ప్రసారం చేయాలని మంత్రి హరీష్ ఛానళ్లకు ఫోన్లు చేశారని రేవంత్ ఆరోపించారు. ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రసారం చేయాలని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ప్రశ్నించారు. బీజేపీతో పొత్తులో ఉన్న కుమార స్వామి ప్రెస్‌మీట్.. మంత్రి హరీశ్ సమన్వయం చేయడం ఏంటి? నిలదీశారు.

మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీ, జేడీఎస్, ఎంఐఎం దుష్ట చతుష్టయం కుట్ర చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉంటుంది. బీజేపీ స్పష్టంగా బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపించారు.

మేడిగడ్డ కుంగిన ఘటనలో అసాంఘిక శక్తుల పని అని తప్పుడు కేసులుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్‌పై చర్యలు తీసుకోవాలి అని రేవంత్ అన్నారు. మైనారిటీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలకులకు వత్తా పలుకుతున్న పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+