కాంగ్రెసే నీకు జీవితం ఇచ్చింది... లేదంటే ఫుట్‌పాత్‌పై ఉండేవాడివి.. ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ రేవంత్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరోక్షంగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దానం నాగేందర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు. 'ఖైరతాబాద్‌లో ఒక నాయకుడు ఉన్నాడు. కాంగ్రెస్‌లో ఆయనకు ఎమ్మెల్యేగా,మంత్రిగా అవకాశం ఇస్తే.. సిగ్గు లేకుండా పార్టీ మారాడు. తీరా ఇప్పుడు కాంగ్రెస్‌లో ఏముందని అంటున్నాడు. కాంగ్రెసే నీకు జీవితం ఇచ్చింది లేకపోతే ఫుట్‌పాత్ మీద ఉండేవాడివి..' అని విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు దాసోజు శ్రవణ్ కార్యాలయంలో ఆదివారం(జులై 4) ఆయన్ను కలిసిన సందర్భంగా రేవంత్ మాట్లాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ద్రోహులను కేసీఆర్ అందలం ఎక్కించారని రేవంత్ ఆరోపించారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారులకు గుర్తింపు లేదన్నారు. తెలంగాణ ద్రోహులైన ఎర్రబెల్లి దయాకర్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,సబితా ఇంద్రారెడ్డి,పోచారం శ్రీనివాస్ రెడ్డిలే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ను వీడినవారంతా తిరిగి పార్టీలోకి రావాలని ఇటీవల రేవంత్ చేసిన వ్యాఖ్యలపై దానం నాగేందర్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలకు తలా,తోకా ఉండదని దానం వ్యాఖ్యానించారు. అయినా కాంగ్రెస్‌లో చేరడానికి ఇప్పుడా పార్టీలో ఏమీ లేదన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకూ టీఆర్ఎస్‌లోనే ఉంటానని.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు చీము, నెత్తురు ఉంటే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని అన్నారు.దానం చేసిన ఈ వ్యాఖ్యలపై రేవంత్ తాజాగా కౌంటర్ ఇచ్చారు.
ఇకపోతే,తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యాక పార్టీలోని కీలక నేతలందరితో రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షులు దాసోజు శ్రవణ్‌ను రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు ఖైరతాబాద్ కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి.శ్రవణ్ రేవంత్‌కు శాలువా కప్పి పుష్ప గుచ్ఛం అందించారు. పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు రేవంత్‌కు శాలువా కప్పి ఫోటోలు దిగారు. అనంతరం పురోహితులు,ఆయా మత పెద్దలు సర్వమత ప్రార్థనలు జరిపి రేవంత్‌కు దీవెనలు అందించారు. రేవంత్‌తో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్,సీనియర్ నేత మల్లు రవి తదితరులు శ్రవణ్ కార్యాలయానికి వెళ్లారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications