సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసులో బాంబు పేల్చిన రేవంత్ : అసలు కధ ఇదీ : కేటీఆర్ గోవా ఎందుకెళ్లారు..!!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ బాంబు పేల్చారు. దీని వెనుక పెద్ద కధ ఉందంటూ కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చారు. నాలుగేళ్ల క్రితం తొలుత ఈ కేసు విచారించిన ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ మధ్యలోనే కేసును వదిలేసారని..ఆయన్ను బదిలీ ఎందుకు చేసారని ప్రశ్నించారు. కేసును తొక్కి పెట్టారని రేవంత్ ఆరోపించారు. దీని పైన తాను హైకోర్టు లో ఈ వ్యవహారం పైన పిల్ దాఖలు చేసిన విషయం వెల్లడించారు. అంతర్జాతీయంగా పలు ప్రాంతాల నుంచి డ్రగ్స్ ఎలా వస్తున్నాయని విచారణ జరిగిందన్నారు.

రేవంత్ పిల్ - సహకరించని ప్రభుత్వం

రేవంత్ పిల్ - సహకరించని ప్రభుత్వం


హైకోర్టు పదే పదే రాష్ట్ర ప్రభుత్వ విధానం చెప్పమని కోరినా..ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చిందన్నారు. తాము విచారణ చేసామని ప్రభుత్వం కోర్టులో చెప్పుకొచ్చిందని వివరించారు. ఎన్ ఫోర్స్ మెంట్- సీబీఐ విచారణ చేయించాలని తాను కోరానన్నారు. ఈ రెండు సంస్థలు తమకు ఈ విషయంలో సహకారం అందించటం లేదంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసాయని చెప్పుకొచ్చారు. దీంతో..హైకోర్టు జోక్యంతో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చాయని చెప్పారు. కేంద్ర సంస్థలు విచారణకు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదని ప్రశ్నించారు. ఇందులో ప్రభుత్వంలోని ముఖ్యులు-వారి సన్నిహితుల ప్రమేయం ఉందా అని నిలదీసారు.

కేటీఆర్ గోవా రహస్యంగా ఎందుకు వెళ్లారు..

కేటీఆర్ గోవా రహస్యంగా ఎందుకు వెళ్లారు..

మంత్రి కేటీఆర్ గోవా రహస్య పర్యటన ఎందుకు జరిగిందని రేవంత్ ప్రశ్నించారు. కోర్టులో తాను వేసిన కేసులో భాగంగానే..ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చారని చెప్పారు. నోటీసులు ఇచ్చిన వారి వద్ద ఆధారాలు ఉన్నాయా... లేవా... ఆర్దిక లావాదేవీలు ఉన్నాయంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రం నుంచి నగదు బదిలీ అయింది... ఇతరుల ప్రమేమం ఎవరెవరిది ఉందనేది విచారణలో తేలుతుందన్నారు. దీని పైన విచారణ చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటని రేంత్ ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా కేటీఆర్ ఆందోళనలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే, తాను ఈ వ్యవహారంలో ఎవరి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయటం లేదని..విచారణలో తేలుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనేదే తన ఆందోళన అని చెప్పుకొచ్చారు.

మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు..

మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు..

తనకు ఛాలెంజ్ చేసిన మంత్రి మల్లారెడ్డి పైన టీపీసీసీ చీఫ్ రేంత్ భూ ఆక్రమణ ఆరోపణలు చేసారు. మల్లారెడ్డికి సంబంధించి చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. తాను మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చానని పేర్కొన్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన వ్యవహారంలో మల్లారెడ్డిని కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. 50 ఎకరాల రియల్ ఎస్టేట్‌ వ్యవహారంలో మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మల్లారెడ్డిపై విచారణకు కేసీఆర్‌ సాహసించలేదని తప్పుబట్టారు. లే అవుట్లలో ప్లాట్లు అమ్ముకునే వారి నుంచి మామూళ్లు వసూలు చేశారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన నిర్వహిస్తున్న విద్యా సంస్థలు ఉన్న భూముల లెక్కలను-వివరాలను తేల్చాలని డిమాండ్ చేసారు.

రాజయ్య-ఈటల తరహాలో చర్యలు తీసుకుంటారా..

రాజయ్య-ఈటల తరహాలో చర్యలు తీసుకుంటారా..

సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్‌ చెప్పారని, అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రి మల్లారెడ్డి అక్రమాల పైన విచారణ చేస్తారా అని ప్రశ్నించారు. వారిద్దరినీ కేబినెట్ నుంచి తీసేసిన సీఎం కేసీఆర్..ఇప్పుడు మల్లారెడ్డిని సైతం తప్పిస్తారా..తన పక్కనే కూర్చోబెట్టుకుంటారా అంటూ రేవంత్ నిలదీసారు. గతంలో మల్లారెడ్డి బెదిరింపుల పైన ఆధారాలు ఉన్నా కేసీఆర్ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. గజదొంగలకు పక్కన పెట్టుకొని కేటీఆర్ నీతులు చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

Recommended Video

    దళిత గిరిజన దీక్షలో గర్జించిన రేవంత్ రెడ్డి..!! || Oneindia Telugu
    ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా- ఎన్నికలకు సిద్దమా

    ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా- ఎన్నికలకు సిద్దమా

    చంద్రబాబుకు చెప్పులు మోసి బతికింది కేసీఆర్ అంటూ రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాను మల్లారెడ్డికి కాదని-కేసీఆర్ కే సవాల్ విసురుతున్నానంటూ...ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్దమా అని ప్రశ్నించారు. తాను ఇప్పుడు ఎన్నికలకు సిద్దమని సవాల్ చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడికే టీడీపీ నేత పేరు పెట్టుకున్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే, రాజకీయంగా వ్యాఖ్యలు ఎలా ఉన్నా డ్రగ్స్ కేసులు కొందరిని అకున్ సబర్వాల్ వదిలేసారని..కేటీఆర్ దగ్గరి వారికి ప్రమేయం ఉందంటూ రేవంత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం గా మారాయి. కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+