వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

రాష్ట్రంలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌ వాడీ చిన్నారులకు బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీమ్‌ ను ప్రారంభించారు. అంగన్‌ వాడీ చిన్నారులకు ఇక నుంచి రెడీ టూ కుక్‌ ఫుడ్‌ ను అందించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఉప్మా, కిచిడీ మిక్స్‌ ను బ్రేక్‌ ఫాస్ట్‌ గా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు అంగన్‌ వాడీ కార్యకర్తలు చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న సంకల్పంతో 'తొలి ముద్ద' పేరుతో కొత్త బ్రేక్‌ ఫాస్ట్ స్కీమ్ ను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఇకపై చిన్నారులకు ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి 'రెడీ టూ కుక్' ఆహారాన్ని అల్పాహారంగా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. వారి ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టాం. తల్లి గర్భంతో ఉన్నప్పుడు తల్లితో పాటు కడుపులోని శిశువు, అలాగే పుట్టిన తర్వాత పిల్లలకు ఎలాంటి పోషకాహారం అందించాలన్న అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత ఈ కార్యాచరణ చేపట్టామని తెలిపారు.

RevanthReddy Introduces Ready to Cook Breakfast for Anganwadi Kids Upma Khichdi Anganwadi breakfast

అలాగే అంగన్‌ వాడీ కార్యకర్తలు.. చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. అలాగే అంగన్‌ వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీళ్లేదని.. సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అంగన్‌ వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల మాదిరిగా భావిస్తోందని.. మీ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు కలిగినా ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+