రెవెన్యూ ఉద్యోగుల వేధింపులు : ఆత్మహత్య చేసుకుంటానని కేసీఆర్‌కు లేఖ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల వేధింపులు ఎక్కువవుతున్నాయి. వారి వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు మన కళ్లముందే కదలాడుతున్నాయి. తాజాగా నగర నడిబొడ్డున కూడా ఇలాంటి ఘటనే కలకలం రేపింది.
వేధింపులు తాళలేక ..
పక్క చిత్రంలో కనిపిస్తోన్న వ్యక్తి పేరు మల్లారెడ్డి. స్వస్థలం పెద్దపల్లి జల్లా పగిడిపల్లి. ఉంటుంది మాత్రం హైదరాబాద్‌లో .. అయితే మల్లారెడ్డి తండ్రి నారాయణ రెడ్డి చనిపోయారు. తనకు వారసత్వంగా వచ్చే భూమిని తన పేరు మీదకు మార్చాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశాడు మల్లారెడ్డి. కానీ అతడి వాదనను వీఆర్వో, వీఏవో వినలేదు.

ఆత్మహత్యే శరణ్యం ...
ఉద్యోగుల వేధింపులతో మల్లారెడ్డి విసిగివేసారి పోయాడు. తన ఆప్లికేషన్‌ను పట్టించుకోవడం లేదని .. చనిపోవడమే శరణ్యమని భావించాడు. తనతోపాటు పిల్లలను తీసుకోని .. తమ చావుకు వీఆర్వో, వీఏవో కారణమని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు. అలాగే ఒక సెల్ఫీ వీడియో కూడా రికార్డు చేశాడు. తాము చనిపోయాక ఆస్తిని తల్లి పేరు మీద రాసివ్వాలని సీఎంకు విన్నవించారు. అయితే మల్లారెడ్డి ఆదృశ్యమవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు .. మల్లారెడ్డి ఆచూకీని కనుకొన్నారు. భువనగిరిలో ఉన్న మల్లారెడ్డిని పట్టుకున్నట్టు పేర్కొన్నారు. మల్లారెడ్డి మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు. ఆయనతోపాటు .. ముగ్గురు పిల్లలను హైదరాబాద్ తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications