ఇయర్ 2016: తెలంగాణలో కెసిఆర్ పాలన ఇలా...
సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను పాటిస్తూ కెసిఆర్ ప్రభుత్వం ప్రథకాలను ప్రవేశపెట్టింది. అయితే, కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా ఆయన తీసుకున్నారు.
హైదరాబాద్ :పేదలకు సంక్షేమ పథకాలను అమలుచేస్తూనే అభివృద్ది కార్యక్రమాలను కొనసాగించేందుకు కెసిఆర్ నేతృత్వంలోని సర్కార్ పనిచేస్తోంది. దీర్ఘ కాలికి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుల రీడిజైన్ ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.భవిష్యత్ లో నీటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకొంది.
ప్రతిష్టాత్మక సంస్థలు హైద్రాబాద్ లో పెట్టుబడులు పెట్టేలా తెలంగాణ సర్కార్ చేసిన కృషి ఫలించింది. కోతలు లేని విద్యుత్ ను అందిస్తూ అందరి ప్రశంసలు పొందింది. రానున్న రోజుల్లో నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్.సంక్షేమ పథకాలను , అభివృద్ది కార్యక్రమాలను సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగుతోంది ప్రభుత్వం.
పాలన వికేంద్రీకరణ కోసం కొత్తగా జిల్లాలను పునర్విభజించింది ప్రభుత్వం. దసరా నుండి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాలుగా మారింది. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటై సుమారు రెండున్నర ఏళ్ళు పూర్తి కావస్తోంది.ప్రభుత్వం ఏర్పాటైన నాటినుండి సంక్షేమ కార్యక్రమాల అమలు పై కెసిఆర్ ప్రధానంగా కేంద్రీకరించారు. అయితే అదే సమయంలో అభివృద్ది కార్యక్రమాలను ఏ మాత్రం ఉపేక్షించలేదు. ఈ రెంటిని సమన్వయం చేసుకొంటూ పాలన సాగిస్తున్నాడు.
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రీ డిజైన్ చేశాడు. రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నది జలాల్లో ఉన్న కేటాయింపు ల ఆధారంగా నీటిని వాడుకొనేందుకు అనుగుణంగా ప్రాజెక్టుల రీ డిజైన్ కు పూనుకొంది. మరో వైపు ప్రాజెక్టుల రీ డిజైన్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ వేదికగా సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు.
టిఆర్ ఎస్ కు ఓట్లను కురిపించిన డబుల్ బెడ్ రూమ్ పథకంలో ఇంకా వేగం పెరగాల్సి ఉంది.ఆపిల్, గూగుల్ లాంటి సంస్థలు తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలను సిద్దం చేసుకొన్నాయి. కొత్త క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి , అక్కడి నుండే సిఎం కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. అయితే కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలని భావించినా పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకొన్నాడు సిఎం.

తెలంగాణలో పెరిగిన జిల్లాలు
ఎన్నికల ప్రచారంలో జిల్లాలను పునర్వవ్యవస్థీకరణ చేస్తామని కెసిఆర్ ప్రకటించారు. ఈ మేరకు పది జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విభజించారు .అయితే జిల్లాల విభజన విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విపక్షాలు ప్రభుత్వ తీరును వ్యతిరేకించాయి. జిల్లాల ఏర్పాటుపై ఒక్క దఫా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. తుది ప్రతిపాదనలపై విపక్షాలను సంప్రదించకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకే జిల్లాలో కాకుండా రెండు మూడు జిల్లాలకు విస్తరించిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి.దసరా నుండి కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. సిద్దిపేట జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి కొత్త జిల్లాలకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలోకి పెట్టుబడులు ఇలా...
తెలంగాణ ప్రభుత్వం ఏకగవాక్ష నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చింది.పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించుకొనేందుకు 30 రోజుల్లో అనుమతులు వచ్చేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.అనుమతులు సకాలంలో ఇవ్వకపోతే....అధికారులపై చర్యలు తీసుకోనేలా ఈ విధానాన్ని రూపొందించారు.జిల్లా...రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేసే కమిటీలు...పరిశ్రమల అనుమతులను మంజూరు చేస్తాయి.పరిశ్రమల ఏర్పాటుకు ఐదు లక్షల ఎకరాలతో భూమి బ్యాంక్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ భూమిని టిఎస్ఐఐసికి బదిలీ చేయనుంది.ఈ మేరకు .ఈ పథకం కింద రాష్ట్రస్థాయిలో 396, జిల్లా స్థాయిలో 1623 పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం.వీటి ద్వారా 35 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.దీంతో లక్షా20 వేల 169 మందికి ఉపాధి లభిస్తోంది.విద్యుత్ రాయితీల కోసం 182.81 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇలా..
పారిశ్రామికవేత్తలకు పావలా వడ్డీకి రుణాలు అందించేందుకు 86.23 కోట్లను కేటాయించింది.ఐ టి రంగంలో రాష్ట్రం దూసుకుపోతోంది.2014..15 లో ఐటి ఎగుమతులు, ఐటి సేవల విలువ 68,258 కోట్లు.మైక్రో సాఫ్ట్, గూగుల్, ఐబి ఎం,ఒరాకిల్ లతో పాటు..గూగుల్ సంస్థ..అమెరికా తర్వాత..హైద్రాబాద్ లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.అమెజాన్ సంస్థ తమ క్యాంపస్ ను హైద్రాబాద్ లో ఏర్పాటు చేస్తోంది.టీ హాబ్ ను 2015 నవంబర్ లో ప్రారంభించారు.టీ హాబ్ రెండో దశకు త్వరలో ప్రారంభించనున్నారు.ఆపిల్ సంస్థ హైద్రాబాద్ లో తన కార్యకలాపాలను ప్రారంభించింది.

మహిళల కోసం పథకాలు..
మహిళలపై దాడులు..దౌర్జన్యాలను అరికట్టేందుకుగాను మహిళ భద్రత కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది.ఈ మేరకు నగరంలోని 2600 సిటీ బస్సుల్లో మహిళలు...పురుషుల సీట్లకు మద్య స్లైడర్లను ఏర్పాటు చేయనున్నారు.మహిళల సమస్యలను పరిష్కరించేందకు 24 గంటలపాటు పనిచేసేలా హెల్ప్ డెస్క్ లు..181 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈవ్ టీజర్ల ఆటకట్టించేందుకు గాను షీ టీమ్స్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.హైద్రాబాద్ లో నే కాకుండా జిల్లాల్లో కూడ షీ టీమ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.షీ ఆటోలు...క్యాబ్ లు..టాక్సీలు నడపాలని నిర్ణయం తీసుకొంది సర్కార్.మహిళా డ్రైవర్లకు 50 శాతం సబ్సిడిపై వాహానాలు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం
ఆడపిల్ల వివాహం కోసం పేద ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది.బిపిఎల్ పరిధిలోని కుటుంబంలోని పేదింటి యువతి వివాహాం కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం తీసుకువచ్చింది.2014 అక్టోబర్ 21న, ఈ కళ్యాణలక్ష్మీ పథకాన్ని తెచ్చింది.తొలుత ఎస్ సి ఎస్ టి లకే కళ్యాణలక్ష్మీ, మైనార్టీలకు షాదీ ముబారక్ ను వర్తింపజేశారు.2016..17 ఆర్థిక సంవత్సరం నుండి బిసిలకు,ఈ బి సిలకు కూడ వర్తింపజేయనున్నారు.వివాహం చేసుకొనే యువతికి 51 వేల రూపాయాలను ప్రభుత్వం ఈ పథకం కింద అందజేయనుంది. ఇప్పటివరకు సుమారు లక్ష మంది లబ్దిపొందారు.ఆసరా పథకం కింద పెద్దఎత్తున పెన్షన్లను మంజూరు చేస్దోంది. రాష్ట్రంలో 35 లక్షల 87 వేల184 మంది పెన్షన్లు పొందుతున్నారు.దీని కోసం ప్రభుత్వం 4478 కోట్లను ఖర్చు చేస్తోంది.2013..14 లో 31 లక్షల మందికి 964.09 కోట్లు, 2015..16 లో 3719.97 కోట్ల వ్యయంతో 36 లక్షల మందికి పెన్షన్లు అందించారు.ఈ ఏడాది (2016..17 ) లో ఈ పథకానికి 4693 కోట్లను కేటాయించింది ప్రభుత్వం.

డబుల్ బెడ్రూం స్కీమ్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం ఈ పథకం అధికార టిఆర్ ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికల్లో ఓట్లను తెచ్చిపెడుతోంది.రాష్ట్రంలో రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్ 27న, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది.మౌళిక వసతుల కోసం ఒక్కో ఇంటికి 1.25 లక్షలు,పట్టణ ప్రాంతాల్లో 75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి 5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో 5.04 లక్షలు, జిహెచ్ ఎం సి పరిధిలో 7 లక్షలతో ఇళ్ళను నిర్మించనున్నారు.2015..16 లో 66 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. వీటి కోసం 4,057 కోట్లను కేటాయించింది.ఈ పథకం కింద ఇళ్ళను నిర్మిస్తే....అధికార పార్టీకి ఇబ్బంది లేదు.ఈ పథకం కింద ఇళ్ళ నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.ఇనుము, ఇసుకను రాయితీల్లో ఇస్తామని కాంట్రాక్టర్లకు సూచించింది.లేకపోతే ఇదే పథకం అధికారపార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది.ఈ ఏడాది గ్రామీణ ప్రాంతంలో 60 వేలు, పట్టణ ప్రాంతంలో 40 వేల ఇళ్ళను నిర్మించనుంది.దశలవారీగా ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది.రాష్ట్రంలోని మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవులకు రిజర్వేషన్లను అమలు చేశారు.182 మార్కెట్లలో 13 మార్కెట్లు షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి.వాటిలో ఎస్ టి లనే నియమిస్తారు.మిగిలిన 169 మార్కెట్లలో 84 మార్కెట్లు రిజర్వ్ అయ్యాయి.బిసిలకు 49, ఎస్ సి లకు 25, ఎస్ టి లకు 10 మార్కెట్లు రిజర్వ్ అయ్యాయి.వీటిలో మహిళలకు 33 శాతం రిజర్వ్ చేశారు. రాష్ట్రంలో 55 మంది మహిళలకు మార్కెట్ చైర్మెన్లు అయ్యే అవకాశం దక్కింది.

మైనారిటీల కోసం పథకాలు..
వాయిస్.మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది.ఈ బడ్జెట్ లో వెయ్యి కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించింది.వక్ఫ్ భూముల రక్షణకు గాను వక్ఫ్ బోర్డుకు జ్యుడిషీయల్ అధికారాలను ఇచ్చింది.త్వరలో వక్ప్ ట్రిబ్యునల్ ను కూడ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది సర్కార్.ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.న్యాయ...పరిపాలనపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది.గిరిజనుల కూడ 12 శాతం రిజర్వేషన్ ను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్ల నివేదికలు వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఈ ఏడాది 70 పాఠశాలలను ప్రారంభించనున్నారు.మొత్తం 120 పాఠశాలలను ప్రారంభించనున్నారు.ఇందులో అమ్మాయిలకు 60 కేటాయించారు.మైదానప్రాంత గిరిజనుల కోసం ఐటిడిఏ తరహా పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది సర్కార్.గిరిజనతండాలు..ఆదివాసీ గూడెలాను గ్రామపంచాయితీలుగా మార్చాలని నిర్ణయం తీసుకొంది.

తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల రీ డిజైన్ కు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రాజెక్టుల రీ డిజైన్ చేశారు.ఈ మేరకు రీ డిజైన్ పూర్తైంది.ప్రతి ఏటా ప్రాజెక్టుల నిర్మాణం కోసం 25 వేల కోట్లను కేటాయించింది.లైడార్ సర్వే నిర్వహించి..ఆ మేరక ప్రాజెక్టుల రీ డిజైన్ ను చేసింది.కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా 1250 టిఎం సిలు, మరో 150 టిఎంసిలకు పైగా మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఉంది.ఈ నీటిని వాడుకొనేందుకు ప్రాజెక్టులను రీ డిజైన్ చేసింది.ప్రాజెక్టుల నిర్మాణానికి, మిషన్ కాకతీయ , మిషన్ భగీరథ పనుల కోసం 25 వేల కోట్లను కేటాయించింది.కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ ఏడాది మే 2న, సిఎం శంకుస్థాపన చేశారు.ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందుతోంది..తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం కోసం 81 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనే విషయమై అసెంబ్లీ వేదికగా సిఎం కెసిఆర్ సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్ చేశారు. గోదావరి, ప్రాణహిత , పెన్ గంగ నదులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతరాష్ట్ర బోర్డును ఏర్పాటు చేసుకొంది ప్రభుత్వం. ఈ బోర్డు సమావేశం ముంబాయిలో జరిగింది. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రెండు రాష్ట్రాలు ఏర్పాటుచేసుకొన్న అంతరాష్ట్ర బోర్డు అంగీకారం తెలిపింది.

వాటర్ గ్రిడ్‌తో కెసిఆర్ ఇలా..
ఈ ఏడాది చివరి నాటికి ఆరువేల గ్రామాలకు ,12 పట్టణాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించనున్నారు.2017 చివరి నాటికి 95 శాతానిక పైగా గ్రామాలు ,పట్టణాలకు మంచినీరు అందించనున్నారు. ప్రపంచ బ్యాంక్ తో పాటు ఇతర ఫైనాన్స్ సంస్థలు కూడ నిధులను ఇచ్చేందుకు సుముఖతను తెలుపుతున్నాయి.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుమారు 4 వేల కోట్లను కేటాయించింది.ఉమ్మడి రాష్ట్రంలో మరుగునపడిపోయిన చెరువుల పూడికతీత పనులను మిషన్ కాకతీయ పేరుతో ప్రారంభించింది సర్కార్.ఈ మేరకు ఐదేళ్ళ పాటు సుమారు 45 వేల చెరువుల పూడికతీత పనులను చేపట్టారు.ఈ ఏడాది సుమారు 9 వేల చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయం తీసుకొన్నారు.ఇప్పటికీ సుమారు 14 వేలకు పైగా చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టేందుకు సర్కార్ అనుమతిఇచ్చింది.ఈ పనులు ఇంకా సాగుతున్నాయి.చెరువుల్లో నీరున్న కారణంగా ఈ ఏడాది చెరువుల పూడికతీత పనులు ఈ దఫా జనవరి మాసంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరించాలని ఈ ఏడాది జనవరి రెండున జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయంతో 18 వేల ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని ఈ ఏడాది జనవరి 2న, నిర్ణయం తీసుకొన్నారు.ప్రస్తుతం 6700 రూపాయాల నుండి వస్తోన్న వేతనాన్ని 12 వేలకు పెంచారు.8,400 రూపాయాల వేతనాన్ని 15 వేల రూపాయాలకు పెంచారు.10,900 రూపాయాల వేతనాన్ని 17 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకొన్నారు.దీంతో ప్రభుత్వం పై నాలుగు వందల నుండి ఐదువందల కోట్ల భారం పడుతోంది.హోంగార్డుల వేతనాలను 9 వేల నుండి 12 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.ఏకీకృత సర్వీసు రూల్స్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.2016 ఏప్రిల్ 5న, సిఎం కెసిఆర్ సంతకం చేశారు.రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం కోసం పంపారు.

విద్యుత్తు కోతలకు తిలోదకాలు
తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించింది..మూడేళ్ళలో విద్యుత్ కష్టాలు తీరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.చత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో ఇప్పటికే సర్కార్ ఎం.ఓ యూ కుదుర్చుకొంది.ఎన్ టి పి సి నుండి 4 వేల మెగావాట్ల..రెండేళ్ళలో తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది.జెన్ కో6 వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయనుంది.2018 నాటికి రాష్ట్రంలో 25 వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు.ఎన్ టి పి సి ద్వారా 4వేలు, జెన్ కో ద్వారా దామరచర్లలో 4 వేల మెగావాట్లు, కొత్తగూడెం లో 800 మెగావాట్లు,మణుగూరులో 1080 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.ఛత్తీస్ ఘడ్ నుండి వెయ్యి మెగావాట్లు త్వరలోనే అందనుంది.సింగరేణి ప్లాంట్ల నుండి 1800 మెగావాట్లు విద్యుత్ త్వరలోనే రాష్ట్రానికి రానుంది.రాష్ట్రం ఏర్పడే నాటికి 4365 మెగావాట్లు.రోడ్ల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.పంచాయితీరాజ్...ఆర్ అండ్ బి రోడ్లను అభివృద్ది చేయనుంది.10 వేల కోట్లతో రోడ్లను అభివృద్ది చేయనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ది రూరల్ రోడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది..డబుల్ బెడ్ రూమ్ పథకం కింద ఐడిహెచ్ కాలనీ 396 ఇళ్ళను ప్రభుత్వం నిర్మించింది.ఇటీవలనే ఈ ఇళ్ళ ప్రారంభించింది.ఈ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు.

వివాదాస్పద నిర్ణయాలుఇవే..
ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. సచివాలయంలోని అన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావించారు. ఈ మేరకు అదికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. సచివాలయంలో మంత్రులతో పాటు అన్ని శాఖల హెచ్ ఓ డి లు ప్రిన్సిఫల్ సెక్రటరీల కార్యాలయాలు కూడ మంత్రుల చాంబర్లకు సమీపంలోనే ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అయితే పెద్ద నగదు నోట్ల రద్దుతో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా ప్రభుత్వం వాయిదా వేసింది. .మెట్రో రైలు అలైన్ మెంట్ వివాదం అలాగే ఉంది. ఎల్ అండ్ టి నుండి మెట్రో రైలుకు అలైన్ మెంట్ మార్పులు లేవు.పాత పద్దతిలోనే మెట్రో రైలు మార్గం కొనసాగుతున్నాయి.సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో పాత అలైన్ మెంట్ ప్రకారంగానే పనులు సాగుతున్నాయి.అధికారంలో లేనప్పుడు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన కెసిఆర్...ప్రస్తుతం అలైన్ మెంట్ మార్పులు లేకుండా పనులు జరుగుతోంటే ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. కెజి నుండి పిజి వరకు ఉచిత నిర్భంధ విద్యను అమలు చేస్తామని కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు.కాని, ఇంతవరకు ఈ పథకానికి సంబందించిన విధి విధానాలను ఖరారు చేయలేదు.ఈ పథకం ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టత లేదని ప్రతిపక్షాలుఆరోపిస్తున్నాయి. కెజి టూ పిజిలో భాగంగానే బిసి, ఎస్ సి,ఎస్ టి , మైనారిటీలకు గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయం తీసుకొంది.












Click it and Unblock the Notifications