వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారు: రేవూరి, బెదిరింపులేంటని కోదండరాం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అబద్దాలను నిజం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అబద్దాలను నిజం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని టిడిపి జిల్లా కార్యాయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా నిరుద్యోగుకు ఉద్యోగాలు లభించలేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్‌ కుటుంబానికి, టిఆర్‌ఎస్‌ నాయకులకు ఉద్యోగాలు దొరికాయన్నారు. 2015 మార్చి 10న అసెంబ్లీలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి మొన్న జరిగిన సమావేశంలో ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయంటూ మాట్లాడుతున్నాడంటే ప్రజలకు సమకాలిన రాజకీయాలపై నమ్మకం పోయిందన్నారు.

నిరుద్యోగుల నిరసన ర్యాలీ నిర్వహించి తీరతాం : కోదండరాం

కరీంనగర్‌: ఎన్ని అవాంతరాలు సృష్టించినా నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించి తీరతామని తెంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరాం చెప్పారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం బెదిరింపులకు ప్పాడడం సరికాదన్నారు. ఫిబ్రవరి 22న చలో హైదరాబాద్‌ పేరిట తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ సన్నాహక సమావేశం సోమవారం కరీంనగర్‌లో జరిగింది.

Revuri and Kodandaram fires at KCR government

ఈ సమావేశానికి హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నవాళ్లు ఎక్కడ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో చెప్పాలని మమ్మల్ని అడగడం ఏంటని ప్రశ్నించారు. తెంగాణ రాష్ట్రం ఏర్పాటైందే నీళ్లు, నియామకాలు, నిధుల పోరాటంతో అన్నారు. అలాంటిది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఐదారువేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదని చెప్పారు.

ప్రభుత్వం ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న 11వేల ఉపాధ్యాయ ఉద్యోగాలతోపాటు 23 వేల నాలుగో తరగతి ఉద్యోగాలెందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. 11వేల పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు రాత పరీక్షు నిర్వహించి నెలలు గడుస్తున్నా నియామకాలు చేపట్టడం లేదని గుర్తుచేశారు. ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై నిర్దుష్టమైన హామీ ఇస్తే నిరసన ర్యాలీలు చేపట్టాల్సి అవసరం వచ్చేది కాదన్నారు.

English summary
Telangana TDP leader Revuri Prakash Reddy and Telangana JAC Chairman Kodandaram on Monday fired at Telangana CM K Chandrasekhar Rao government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X