Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనాకేసుల పెరుగుదల, ఒమిక్రాన్ భయాల మధ్య నుమాయిష్ ఎగ్జిబిషన్ నిలిపివేత.. ఎప్పటివరకు అంటే

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల మధ్య హైదరాబాద్‌లోని ప్రముఖ ట్రేడ్ ఫెయిర్ నుమాయిష్ ఎగ్జిబిషన్ తెరిచిన ఒక రోజు తర్వాత, జనవరి 2 ఆదివారం నాడు తాత్కాలికంగా మూసివేయబడింది. ట్రేడ్ ఫెయిర్‌ను జనవరి 10 వరకు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం కూడా, మహమ్మారి కారణంగా నగరం నుమాయిష్‌ను నిర్వహించలేదు. ఇక ఈ ఏడాది నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎగ్జిబిషన్ కు ఎలా అనుమతిస్తారని అనేకమంది ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

నుమాయిష్ ఎగ్జిబిషన్ తాత్కాలికంగా నిలిపివెయ్యాలన్న ప్రభుత్వం

నుమాయిష్ ఎగ్జిబిషన్ తాత్కాలికంగా నిలిపివెయ్యాలన్న ప్రభుత్వం

ఈ సంవత్సరం, కరోనావైరస్ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ భయాల మధ్య ఈవెంట్ యొక్క 81వ ఎడిషన్ ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన ఒకరోజు తర్వాత తాత్కాలికంగా నిలిపివేయబడింది. నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కోవిడ్-19 ప్రోటోకాల్‌లకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని వాగ్దానం చేసినప్పటికీ, నో-మాస్క్ నో-ఎంట్రీ విధానాన్ని అనుసరిస్తామని ప్రకటించినప్పటికీ, భౌతిక దూరాన్ని నిర్ధారించడం వారికి సవాలుగా మారింది.

ఒమిక్రాన్ భయాల మధ్య ప్రభుత్వ నిర్ణయం

ఒమిక్రాన్ భయాల మధ్య ప్రభుత్వ నిర్ణయం


సొసైటీ స్టాల్ యజమానుల వ్యాక్సినేషన్ ను తప్పనిసరిగా తీసుకునేలా చూడడంతో పాటుగా రోజువారీ శానిటైజేషన్ వంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కోవిడ్-19 సేఫ్టీ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఉండేలా ఎగ్జిబిషన్ వద్ద ప్రత్యేక బృందాలు పెట్రోలింగ్ చేస్తాయని కూడా పేర్కొంది. స్టాల్ యజమానులు వారి పూర్తి డోస్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను సమర్పించే వరకు గుర్తింపు కార్డులను జారీ చేయమని కూడా పేర్కొంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లక్షలాదిగా వచ్చే జనాలను నియంత్రించడం, వారంతా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదన్న క్రమంలో, కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ భయాల మధ్య ప్రభుత్వం నుమాయిష్ ఎగ్జిబిషన్ ను జనవరి పదో తేదీ వరకూ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ నిబంధనలు అమల్లో .. జనవరి 10 వరకు నుమాయిష్ వాయిదా

కోవిడ్ నిబంధనలు అమల్లో .. జనవరి 10 వరకు నుమాయిష్ వాయిదా

కోవిడ్ నిబంధనలు అమల్లో ఉండటంతో నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 10 వ తేదీ వరకు వాయిదా వెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ దాదాపు 45,000 మంది సందర్శించే ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం 'నుమాయిష్' జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. 2019లో 20 లక్షల మందికి పైగా ఎగ్జిబిషన్‌ని సందర్శించారు. అయితే 2021వ సంవత్సరంలో మాత్రం నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించలేదు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల నుండి మాత్రమే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుండి మరియు పొరుగు రాష్ట్రాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు

1938లో ప్రారంభమైన నుమాయిష్ కు విశేష ప్రజాదరణ

1938లో ప్రారంభమైన నుమాయిష్ కు విశేష ప్రజాదరణ


1938లో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులను ప్రోత్సహించే కార్యక్రమంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించబడింది. కేవలం 50 స్టాల్స్‌తో ప్రారంభించి, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనలలో ఒకటిగా రూపుదిద్దుకుంది. హైదరాబాద్ స్టేట్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి నుమాయిష్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. స్థానిక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, హోటళ్లు మరియు ఫుడ్ కోర్ట్ లతో పాటు భారతదేశం అంతటా ఉన్న వ్యాపారులు నుమాయిష్ ఎగ్జిబిషన్ లో స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకుంటారు .

Recommended Video

    Nampally Exhibition 2022 : చకచకా ఏర్పాట్లు..Omicron ఎఫెక్ట్ ఎంతవరకు ? | Oneindia Telugu
    ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ గా నుమాయిష్ .. రెండేళ్లుగా కరోనా దెబ్బ

    ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ గా నుమాయిష్ .. రెండేళ్లుగా కరోనా దెబ్బ

    వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ శాఖలు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు చేరువయ్యేందుకు కూడా ఎగ్జిబిషన్ ను ఒక వేదికగా ఉపయోగిస్తాయి. 1949లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా దీనికి పేరు మార్చబడింది . దీనిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి. రాజగోపాలాచారి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు విశేషమైన ఆదరణ పొందుతూ నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ కు అవాంతరాలు కలుగుతూనే ఉన్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+