నిజామాబాద్ హత్యకేసు నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు

నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, వాహనాల దొంగ రియాజ్‌.. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్‌ ఈ ఉదయం పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు కాల్చి చంపారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఓ ఏఆర్ కానిస్టేబుల్ గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను ఆసుపత్రికి తరలించారు.

జిల్లాలో తరచూ వాహనాలను చోరీ చేసే షేక్ రియాజ్ కోసం కొంతకాలంగా పోలీసులు గాలిస్తూ వచ్చారు. శుక్రవారం రాత్రి అతను పోలీసుల చేతికి చిక్కాడు. అతన్ని అరెస్ట్ చేసిన అనంతరం నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌లోని సీసీఎస్‌ పోలీస్ స్టేషన్ కు తరలిస్తోండగా.. తప్పించుకున్నాడు. ఈ క్రమంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్, ఎస్ఐ విఠల్‌ను కత్తితో పొడిచాడు. కత్తిపోట్లకు గురైన ప్రమోద్ మరణించారు. దీంతో పోలీసులు యుద్ధ ప్రాతిపదికన అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Riyaz died in an encounter by the Police in Nizamabad

దీనికోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. సారంగాపూర్‌ శివారులో రియాజ్‌ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాత లారీ క్యాబిన్‌లో దాక్కున్న అతను పోలీసులు రావడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన సయ్యద్‌ ఆసిఫ్‌ అనే ఓ స్థానికుడు అతన్ని పట్టుకోబోయాడు. దీంతో చోటు చేసుకున్న పెనుగులాటలో రియాజ్‌ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్‌ ను కూడా గాయపరిచాడు. పోలీసులు రియాజ్ ను పట్టుకుని తాళ్లతో బంధించారు.

ఆ పెనుగులాటలో రియాజ్‌ సైతం తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానిస్టేబుల్‌ నుంచి గన్‌ లాక్కొని ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు రియాజ్‌పై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+