ఘోర రోడ్డు ప్రమాదం: కారును టిప్పర్ ఢీకొనడంతో నలుగురు మృతి, పలువురికి గాయాలు
వరంగల్: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కటాక్షపూర్-ఆత్మకూరు రోడ్డు మార్గంలో కారును.. వేగంగా వచ్చిన టిప్పర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కొందరు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
క్షతగాత్రులను హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీరికి వైద్యం అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరందరూ మేడారం వెళ్లి వస్తుండా ప్రమాదం చోటు చేసుకుంది.

మృతులు నరసింహస్వామి(50), సాంబరాజు(42), ఆకాంక్ష(26) లక్ష్మీప్రసన్న(6గా గుర్తించారు. బాధితులు మేడారం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాద ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై వరంగల్ సీపీ రంగనాథ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు.
ఇది ఇలావుండగా, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రెడ్డి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న ట్రాక్టర్‌ను జీపు బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంలో సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 15మంది వరకు గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. క్షతగాత్రులందరూ హైదరాబాద్ వాసులుగా పేర్కొన్నారు స్థానికులు. వీరందరూ కాళేశ్వరం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.












Click it and Unblock the Notifications