మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన నలుగురు సోదరుల మృతి
హైదరాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు మృతి చెందారు. చనిపోయిన నలుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కొన్నేళ్ల క్రితం ఈ నలుగురు అన్నదమ్ములు ఉపాధి కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు. ఐదు రోజుల క్రితం వీరి స్వగ్రామమైన చౌటపల్లిలో బంధువు ఎరుకల రాములు మృతి చెందారు. ఈ క్రమంలో అతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తమ కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. కుటుంబసభ్యులను చౌటపల్లిలోనే ఉంచి ఈ నలుగురు సోదరులు తిరిగి సూరత్‌కు మంగళవారం కారులో బయల్దేరారు.

అదే రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులు ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు మృతి చెందడంతో వారి కుటుంబాలతోపాటు స్వ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
మరో ప్రమాదంలో ఆరుగురు మృతి:మహారాష్ట్రలోని బుల్‌ఢాణా జిల్లాలో మంగళవారం ఎంఎస్ఆర్టీసీ బస్సు ఓ కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఓల్డ్ ముంబై-నాగపూర్ హైవే సింధ్‌ఖేడ్ రాజా పట్టణ సమీపంలో ఉదయం 7.20 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
మృతుల్లో రెండు వాహనాల డ్రైవర్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు. 33 మంది ప్రయాణికులతో బస్సు పుణె నుంచి మెహకర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications