తెలంగాణలో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో పదుల కొద్దీ మృత్యువాత పడడం తీవ్ర విషాదం నింపింది. ఈ తరుణంలోనే ఇప్పుడు తెలంగాణలో మరోసారి రోడ్లు నెత్తురోడాయి. ఒక ప్రమాదంలో మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు చనిపోగా.. హైదరాబాద్ లో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.
మహాజాతరకు వెళ్తూ..
కాగా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కాగజ్‌నగర్‌కు చెందిన సుమారు 20 మంది భక్తులు ట్రాక్టర్‌లో బయలుదేరరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కేశవపూర్ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మేడారం జాతరకు ట్రాక్టర్లు, ట్రాలీల్లో అధిక సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న మహాముత్తారం పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అతి వేగం వల్లే..
మరోవైపు హైదరాబాద్ నగరంలో మౌలాలి లోని స్నేహితుడి ఇంటి వద్ద జరిగిన ఫంక్షన్ కి నిఖిల్ (22) కారులో వెళ్లి వస్తూ పోచారం సద్భావన టౌన్షిప్ లో ఉంటున్న స్నేహితులను దింపేందుకు వెళ్తుండగా.. మేడిపల్లి లోని ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్, పిల్లర్ నెంబర్ 97 వద్దకు రాగానే వాహనం అదుపుతప్పింది. దీంతో పిల్లర్ ను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా.. వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు సాయి వరుణ్, నిఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వేగంగా ఢీకొనడంతో వాహనం నుజ్జునుజ్జు అయింది.
అలానే ఈ దుర్ఘటనలో వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే మరో ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
విశ్వాసం అంటే ఇది.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేస్తే 130కి.మీ వెంట నడిచిన శునకం! -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications