రూ. 5 లక్షలిస్తేనే ఆన్‌లైన్‌లోకి రైతు భూమి: 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో
జయశంకర్ భూపాలపల్లి: మరో అవినీతి తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. పక్కా ప్లాన్ వేసిన అధికారులు ఆ తహసీల్దార్‌ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లిలోని కాటారం మండలం తహసీల్దార్ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కారు.
వివరాల్లోకి వెళితే.. కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఐతా హరికృష్ణ అనే రైతు తన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. రోజులు గడిచినా ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో తహసీల్దార్ సునీతను ఆశ్రయించారు.

అయితే, రూ. 5 లక్షలు లంచం ఇస్తేనే భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తానని చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తహసీల్దార్‌తో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందం మేరకు తొలి విడతగా రూ. 2 లక్షలు లంచం ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు తహసీల్దార్ సునీతను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 2.01 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఒక లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో దాన్ని పరిశీలించారు. 1005 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. దీని విలువ రూ. 2.01 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. నిందితులు సత్యనారాయణ, ప్రజాపతి, కరణ్ సింగ్‌లను విచారించారు. తమది మధ్యప్రదేశ్‌లోని అగర్ జిల్లా పరిధిలోని దండం గ్రామమని నిందితులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications