హైదరాబాదులో రూ.5కే భోజనం, టెక్కీలు కూడా తింటున్నారు!
హైదరాబాద్: రూ.5 భోజనాన్ని సాఫ్టువేర్ ఉద్యోగులు కూడా తింటున్నారని జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ మంగళవారం నాడు తెలిపారు. లక్డీకాపూల్ రెడ్ హిల్స్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఐదు రూపాయలకే భోజనం సదుపాయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ మంత్రితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.5 భోజన పథకం ద్వారా రోజుకు 15,000 మంది హైదరాబాదీలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పేద ప్రజలే కాకుండా సాఫ్టువేర్ ఉద్యోగులు కూడా ఈ భోజన సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారన్నారు.

హుక్కాసెంటర్లపై పోలీసుల దాడులు
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో హుక్కాసెంటర్లపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు దాడులు చేశారు. ఈ సోదాల్లో పోలీసులు 15 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు హుక్కా సెంటర్లను సీజ్ చేశారు.
గార్లలో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత
ఖమ్మం జిల్లాలోని గార్లలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు పట్టుకున్నారు. ఓ ట్రాక్టర్‌లో తరలిస్తున్న 137 జిలెటిన్ స్టిక్స్, 152 డిటోనేటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications